ప్రపంచంలో అత్యంత హైస్పీడ్ రైలు ఏదో తెలుసా?

TV9 Telugu

05 January 2025

అత్యాధునిక హై-స్పీడ్ బుల్లెట్ రైలు మోడల్‌ను ఇటీవల చైనా ఆవిష్కరించింది. గంటకు 450 కిలోమీటర్ల స్పీడుతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై-స్పీడ్ రైలుగా నిలిచింది.

చైనా స్టేట్ రైల్వే గ్రూప్ కో. (చైనా రైల్వేస్) ప్రకారం, CR450 ప్రోటోటైప్ అని పిలువబడే కొత్త మోడల్ ప్రయాణ సమయాన్ని మరింత తగ్గిస్తుంది.

ఇది నగరాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ప్రయాణీకులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

CR450 నమూనా ట్రైన్ పరీక్ష వేగం గంటకు 450 కిలోమీటర్లుగా నమోదైందని చైనా దేశం ప్రభుత్వ మీడియా పేర్కొంది.

ప్రస్తుతం సేవలో ఉన్న CR400 Fuxing హై-స్పీడ్ రైలు (HSR) కంటే చాలా వేగవంతమైనది. ఇది గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.

ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన రైలుగా పరిగణిస్తున్నారు. దీనికి కారణం ఈ రైలును ప్రత్యేకంగా రూపొందించడమే.

రైలు వేగాన్ని దృష్టిలో ఉంచుకుని, రైలు బ్రేకింగ్ సిస్టమ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇది అపూర్వమైన వేగంతో కూడా స్థిరత్వం, భద్రతను నిర్ధారిస్తుంది.

జిన్హువా ప్రకారం, కొత్త ప్రోటోటైప్‌లు - CR450AF, CR450BF - వాటర్-కూల్డ్, పర్మనెంట్ మాగ్నెట్ ట్రాక్షన్, హై స్టెబిలిటీ బోగీ సిస్టమ్ వంటి అధునాతన వ్యవస్థలతో ఎనిమిది కార్ల నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి.