వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని మీరూ తింటున్నారా? 

06 January 2025

TV9 Telugu

TV9 Telugu

వేడివేడి అన్నంలో కాస్త ముద్ద పప్పు, నెయ్యి వేసుకుని తింటే ఆ మజానే వేరప్ప.. ఇక ఆవకాయ, నెయ్యి కాంబినేషన్‌ నభూతో నభవిష్యతి. ఇలా తెలువారి విందులో నెయ్యి రుచులు కోకొల్లలు

TV9 Telugu

కానీ నేటికాలంలో లెక్కలు వేరేఉన్నాయి. కెలొరీల లెక్కల్లో కమ్మని నెయ్యి రుచులు నీరుగారి పోతున్నాయి. అందుకే, కూరల్లో కాస్త ఘాటెక్కువగా ఉన్నా రెండు చుక్కల నెయ్యి వేసుకోవాలంటేనే బెంబేలెత్తిపోతున్నాం

TV9 Telugu

కానీ, రోజూ రెండు చెంచాల నెయ్యి తింటే మేలంటున్నాయి పలు అధ్యయనాలు. ఫిట్‌గా ఉండాలన్నా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా రోజూ కాస్తింత నెయ్యి చుక్కలు తింటే లాభమేనంటున్నారు నిపుణులు

TV9 Telugu

తినేటప్పుడు మొదటి ముద్దలో రెండు చుక్కలు నెయ్యి కలుపుకొని తింటే సరి.  తిన్నది త్వరగా జీర్ణమయ్యేలా చేయడమే కాదు.. గ్యాస్‌ సంబంధిత సమస్యలనూ దరి చేరనివ్వదు

TV9 Telugu

నెయ్యిలో పోషకాల మోతాదూ ఎక్కువేనట. ముఖ్యంగా కంటిచూపుని మెరుగుపరిచే విటమిన్‌ ఎ ఇందులో పుష్కలంగా దొరుకుతుంది. అంతేకాదు, దీని నుంచి మనకి అందే మంచి కొవ్వులు అధికబరువునీ అదుపులో ఉంచుతాయి

TV9 Telugu

విటమిన్‌ ‘ఇ’ కాలేయాన్ని కాపాడుతుంది. హర్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుంది. వ్యాధినిరోధక శక్తి తక్కువుండేవారు , నెలసరి ఇబ్బందులతో బాధపడేవారు తప్పనిసరిగా రోజూ రెండు చుక్కలైనా నెయ్యివేసుకుని తినాల్సిందే

TV9 Telugu

అయితే ప్రత్యేక పద్ధతిలో, పరిమిత పరిమాణంలో నెయ్యి తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అన్నంలో నెయ్యిని సరైన పరిమాణంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సంపూర్ణంగా మారి, మలబద్ధకం దరిచేరనీయదు

TV9 Telugu

బరువు తగ్గాలనుకునే వారు రాత్రి భోజనంలో లేదా మధ్యాహ్న భోజనంలో అన్నంలో మాత్రమే నెయ్యి తినాలి. ఎందుకంటే ఇది మీ కడుపుని అధిక సమయం పాటు నిండుగా ఉంచుతుంది. పైగా అన్నంలో నెయ్యి కలిపి తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెకు మేలు చేస్తుంది