Health: బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే మందార పువ్వు టీ తాగండి.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసా.?
Health: చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారంలో మార్పుల కారణంగా చిన్న వయసులోనే అధిక బరువు బారిన పడుతున్నారు. అయితే..

Health: చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారంలో మార్పుల కారణంగా చిన్న వయసులోనే అధిక బరువు బారిన పడుతున్నారు. అయితే సహజ పద్ధతుల్లో బరువు తగ్గించుకోవడానికి మనం ఎన్నో విధానాలను పాటిస్తుంటాం. వీటిలో గ్రీన్ టీ ఒకటి. అయితే మందార పువ్వుతో తయారు చేసే టీని తాగితే కూడా ఇలాంటి ఫలితాలే కలుగుతాయని మీకు తెలుసా.? ఇంతకీ మందార పువ్వులో ఉండే లక్షణాలు ఏంటి.? ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
* మందార పువ్వుల్లో పాలీఫినాల్స్, ఆంథోసయనిన్స్, ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి లివర్‌లో కొవ్వు పదార్థాలను పేరుకుపోకుండా చూస్తాయి.
* ఈ టీని నిత్యం తాగడం వల్ల చిన్న పేగులు మనం తినే ఆహారాల్లో ఉండే కొవ్వులను శోషించుకోవు. ఈ కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది.
* మందార టీతో డయాబెటిస్ కూడా అదుపులోకి వస్తుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
* దీనివల్ల గుండె జబ్బులకు చెక్ పెట్టడంతో పాటు వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రావు. చర్మంపై వచ్చే ముడతలను రాకుండా అడ్డుకుంటుంది.
ఇంతకీ ఈ టీని ఎలా తయారు చేయాలంటే..
ముందుగా కొన్ని మందార పువ్వులను ఎండబెట్టుకోవాలి. అనంతరం కొంత నీరు తీసుకొని బాగా మరిగించాలి. అనంతరం ఆ వేడి నీటిలో ఎండిన మందార పువ్వును టేబుల్ స్పూన్ మోతాదులో వేసి 5 నిమిషాలు ఉంచాలి. పువ్వుల్లోని సారం నీటిలోకి చేరిన తర్వాత వడకట్టి తాగేయాలి. ఇలా తయారు చేసుకున్న మందార పువ్వు టీని భోజనానికి అర గంట ముందు లేదా భోజనానికి భోజనానికి మధ్యలో తాగవచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే అధిక బరువును తగ్గించుకోవచ్చు.
Also Read: Toothpaste: మీ పిల్లలు టూత్‌పేస్ట్ తింటున్నారా.. అయితే ఎముకలు బలహీనపడతాయి..
Kitchen Tips: ఇలా చేస్తే వంటింట్లో పాలు పొంగిపోవు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..