Covid 19: కొవిడ్ అలర్ట్.. కరోనా లక్షణాలు మారాయి.. ఇప్పుడు కొత్తగా ఇలాంటి సిమ్‌టమ్స్..
Covid 19: కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఇప్పటికి కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనాతో పాటు ఇతర వైరస్‌లు కూడా విజృంభిస్తున్నాయి.

Covid 19: కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఇప్పటికి కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనాతో పాటు ఇతర వైరస్‌లు కూడా విజృంభిస్తున్నాయి. తాజాగా కొవిడ్ తన లక్షణాలను మార్చుకున్నట్లుగా కోల్‌కతా వైద్యులు చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ నుంచి కోవిడ్ లక్షణాలు మారాయని అంటున్నారు. దీని వల్ల వ్యాధి నిర్ధారణను గుర్తించడం కష్టమవుతుందని పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగా రోగులు అధిక జ్వరాలతో బాధపడటంలేదని కానీ తక్కువ-గ్రేడ్ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. అయితే ఇప్పటికే చాలామంది టీకాలు వేసుకున్నందు వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. అయితే కరోనా మొదటి, సెకండ్ వేవ్‌లలో కనిపించే తీవ్రమన లక్షణాలు ఇప్పుడు కనిపించడం లేదు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడానికి ఇది కూడా ఒక కారణం.
ఒకే కుటుంబానికి చెందిన పలువురికి దగ్గు, జలుబు కరోనా లక్షణాలతో వచ్చిన రోగులకు చికిత్స చేసిన కొంతమంది వైద్యులు వైరస్ లక్షణాలు మారినట్లు చెబుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన పలువురు దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు సూచించారు. మారుతున్న సీజన్లలో దగ్గు, జలుబు సాధారణం కాబట్టి మొదట్లో ఇది సాధారణ ఫ్లూ అనుకున్నారు. కానీ ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నారని ఆలస్యంగా తెలుసుకున్నారు. ఇప్పుడు వీరి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది సీజనల్ సమస్య కాదని రూపం మార్చుకున్న కరోనా లక్షణాలుగా చెబుతున్నారు.
RT-PCR నివేదికలో కోవిడ్-పాజిటివ్ చాలా మంది రోగులు చికిత్స తర్వాత కోలుకున్నప్పటికీ కొంతమందికి ఇంకా లక్షణాలు కొనసాగుతున్నాయి. రుచి, వాసన కోల్పోవడం జరుగుతుంది. ఇది సాధారణంగా జ్వరం ప్రారంభమైన ఎనిమిదవ లేదా తొమ్మిదవ రోజులో సంభవిస్తుంది. ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు హాజరైన వారిలో చాలామందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుంది. అటువంటి రోగులు కొందరు ఆసుపత్రిలో చేరవలసి వస్తుంది. అంతేకాదు ఇప్పుడు పొడి దగ్గకు బదులు తడి దగ్గు ఎక్కువ మందిలో ఉంటుంది. ఇది కొవిడ్ లక్షణాలలో ఒకటి మారింది. దీంతో వైద్యులు ఆశ్చర్యపోతున్నారు.