Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toothpaste: మీ పిల్లలు టూత్‌పేస్ట్ తింటున్నారా.. అయితే ఎముకలు బలహీనపడతాయి..

దంతాలను శుభ్రపరచడానికి టూత్‌పేస్ట్ చాలా ముఖ్యం, కానీ అది మీ పిల్లలకు ప్రమాదకరం కావొచ్చు. టూత్‌పేస్ట్ కడుపులోకి వెళ్లి స్కెలెటల్ ఫ్లోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధి వస్తుంది...

Toothpaste: మీ పిల్లలు టూత్‌పేస్ట్ తింటున్నారా.. అయితే ఎముకలు బలహీనపడతాయి..
Paste
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 12, 2021 | 9:16 PM

దంతాలను శుభ్రపరచడానికి టూత్‌పేస్ట్ చాలా ముఖ్యం, కానీ అది మీ పిల్లలకు ప్రమాదకరం కావొచ్చు. టూత్‌పేస్ట్ కడుపులోకి వెళ్లి స్కెలెటల్ ఫ్లోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధి వస్తుంది. ఆ తర్వాత శరీరంలోని ఎముకలు బలహీనపడతాయి. దంతాలు కూడా దెబ్బతింటాయి. టూత్‌పేస్ట్‌ను వాడుతున్నప్పుడు, పిల్లవాడు మింగకుండా చూడాలని న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లోని రుమటాలజీ విభాగానికి చెందిన డాక్టర్ రంజన్ గుప్తా చెప్పారు. పిల్లలు వీటిని తింటే ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. ఆరేళ్లలోపు చిన్నారుల శరీరంలో ఫ్లోరైడ్‌ నేరుగా చేరడం చాలా ప్రమాదకరమని పరిశోధనల్లో వెల్లడైంది. దీంతో వారిలో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, దంతాలను శుభ్రపరచడానికి బఠానీ గింజ సైజ్ టూత్‌పేస్ట్ ఉపయోగించాలని చెప్పారు.

ఫ్లోరోసిస్ వ్యాధి అంటే ఏమిటి ఫ్లోరోసిస్ రెండు రూపాల్లో వస్తుందని డాక్టర్ రంజన్ చెప్పారు. వీటిలో మొదటిది డెంటల్ ఫ్లోరోసిస్, ఇది ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఇందులో ఆరేళ్లలోపు పిల్లల దంతాలు పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. రెండవది స్కెలిటల్ ఫ్లోరోసిస్, ఇది శరీరంలోని కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఇందులో మెడ, వీపు, భుజాలు, మోకాళ్లు బలహీనంగా మారి వాటిల్లో ఎప్పుడూ నొప్పి ఉంటుంది.

ఫ్లోరోసిస్ యొక్క లక్షణాలు

  • దంతాలు పసుపుగా మారుతాయి.
  • మోకాళ్ల చుట్టూ వాపు.
  • కీళ్ల నొప్పి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. చాలా చిన్న పిల్లలకు తక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ ఉపయోగించండి.

2. నోటిని కడుక్కోవడానికి పిల్లలతో ఉండండి మరియు పేస్ట్ మింగకుండా నిరోధించండి.

3. టూత్‌పేస్ట్‌ను పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంచండి.

4. పిల్లవాడు ఎక్కువ మొత్తంలో పేస్ట్‌ను మింగినట్లయితే, వెంటనే అతనిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లండి.

Read Also.. Boiled Eggs: బయట ఉడకబెట్టిన గుడ్లు తింటున్నారా? అయితే, జాగ్రత్త.. అందులో ప్రమాదకరమైన సూడోమోనాస్ బ్యాక్టీరియా ఉండొచ్చు!

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో