Air Pollution: మీకు తెలుసా.. వాయు కాలుష్యంతో చివరికి కళ్లు పోయే ప్రమాదం కూడా ఉంది. వైద్యుల మాటేంటంటే..
Air Pollution: యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో వాయు కాలుష్యం ఒకటి. పెరుగుతోన్న పారిశ్రామికరణ, ఇంధన వినియోగం కారణంగా వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. మనదేశంలో కూడా..
Air Pollution: యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో వాయు కాలుష్యం ఒకటి. పెరుగుతోన్న పారిశ్రామికరణ, ఇంధన వినియోగం కారణంగా వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. మనదేశంలో కూడా కొన్ని నగరాల్లో వాయు కాలుష్యం ప్రమాదక స్థాయికి చేరుతోందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. అయితే వాయు కాలుష్యం ఆరోగ్యానికి హాని చేస్తుందని మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా కాలుష్యం కారణంగా శ్వాస సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తులు పాడవడం లాంటి సమస్యలు వస్తాయని మనందరికీ తెలిసిందే. అయితే వాయుకాలుష్యం కేవలం శ్వాస వ్యవస్థపైనే కాకుండా కళ్లపై కూడా ప్రభావం చూపుతుందని మీకు తెలుసా.?
విషపూరితమైన గాలుల వల్ల కళ్లు కూడా దెబ్బతింటున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయమై షార్ప్ సైట్ ఐ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్ హేమ్ పలు కీలక విషయాలు వెల్లడించారు. కాలుష్యం కారణంగా కంటి సంబధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కాలుష్యం కారణంగా కళ్లు పొడిబారుతాయి. ఇది అలర్జీకి దారి తీస్తుంది. కంటిలో తగినంత తడి లేకపోతే డ్రై ఐ సిండ్రోమ్ అనే వ్యాధి సంభవిస్తుంది.
వాయు కాలుష్యం కళ్లలోని కణాలను ప్రభావితం చేస్తుంది, దీని వల్ల కళ్లు పొడిబారడం, ఎరుపు రంగులోకి మారడం, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కలుషితమైన గాలిలో నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి మూలకాలు ఉండటం వల్ల కళ్లకు ఎక్కువ నష్టం జరుగుతుందని హేమ్ చెప్పుకొచ్చారు. ఇక వాయు కాలుష్యం దీర్ఘకాలికంగా అలాగే కొనసాగితే.. కంటి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
వాయు కాలుష్యం నుంచి కళ్లను కచ్చితంగా రక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడమే మేలని చెబుతున్నారు. అలాగే కళ్లు పొడిబారకుండా ఉండడానికి తరచూ కళ్లు మూస్తూ, తెరుస్తూ ఉండాలి. అలాగే శరీర డీహైడ్రేషన్‌కు గురి కాకుండా నిత్యం తగినంతా నీటిని తాగాలని సూచిస్తున్నారు. అలాగే ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు కళ్లజోడు, హెల్మెట్‌లాంటివి తప్పకుండా వాడాలని చెబుతున్నారు.
పాత నోట్లే కదా అని పక్కకు పడేస్తున్నారా..! ఇప్పుడు అవే సిరులు కురిపిస్తున్నాయి ఎలాగంటే..?
Know This: చనిపోయిన వ్యక్తి వేలిముద్రలను ఎలా గుర్తిస్తారు..? వీడియో