AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: టీఎస్‌ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.. పెళ్లికి ఆర్టీసీ బస్‌ బుక్‌ చేసుకుంటే, కొత్త జంటకు స్పెషల్‌ గిఫ్ట్‌.

TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)కు సజ్జనార్‌ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కొంత పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఆలోచనలతో ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. పలు వినూత్న రకాల ఆఫర్లు, ఐడియాలజీతో..

TSRTC: టీఎస్‌ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.. పెళ్లికి ఆర్టీసీ బస్‌ బుక్‌ చేసుకుంటే, కొత్త జంటకు స్పెషల్‌ గిఫ్ట్‌.
Tsrtc Gift
Narender Vaitla
|

Updated on: Nov 12, 2021 | 7:11 PM

Share

TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)కు సజ్జనార్‌ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కొంత పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఆలోచనలతో ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. పలు వినూత్న రకాల ఆఫర్లు, ఐడియాలజీతో ప్రయాణికులను ఆర్టీసీ బస్సు బాటపటించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సజ్జనార్‌ తాజాగా ప్రయాణికులకు ఆకర్షించేందుకు మరో అడుగు ముందుకేశారు.

సాధారణంగా పెళ్లికి బస్సులను అద్దెకు ఇస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇకపై పెళ్లి బస్సు బుక్‌ చేసుకుంటే కొత్త జంటకు ఆర్టీసీ ఓ బహుమతి ఇవ్వనుంది. వివాహం రోజున ఆర్టీసీ తరఫున వదూవరుల ఫోటో ఫ్రేమ్‌ను అందించనున్నారు. గురువారం నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేశారు అధికారులు. తాజాగా హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఆకుల భరత్‌ కుమార్, సౌమ్యల వివాహం గురువారం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు యాదగిరిగుట్ట డిపోకు చెందిన రెండు బస్సులను అద్దెకు తీసుకున్నారు.

దీంతో వివాహ వేడుకలో ఫోటో ఫ్రేమ్‌ను అందించి.. కొత్త జంటకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు అధికారులు. ఈ వివాహ వేడుకకు ఆ బస్సుల డ్రైవర్లు ఆంజనేయులు, గణేష్‌లతో పాటు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ హాజరై బహుమతిని అందజేశారు. ఇదిలా ఉంటే ఆర్టీసీ మొదటిరోజే 475 జంటలకు కానుకలను అందించడం విశేషం. ఇక ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ ఉండడంతో 5 రోజులుగా రెండు వేల బస్సులను బుక్‌ చేసుకున్నారని అధికారులు తెలిపారు.

Also Read: పాత నోట్లే కదా అని పక్కకు పడేస్తున్నారా..! ఇప్పుడు అవే సిరులు కురిపిస్తున్నాయి ఎలాగంటే..?

Anasuya Bharadwaj: గౌనులో వయ్యారంగా ఒలకబోస్తున్న అనసూయ అందాలు… చూస్తే వావ్ అనాల్సిందే..

Chennai Floods: విధి నిర్వహణలో తెగువను ప్రదర్శించిన తమిళనాడు లేడీ సూపర్ పోలీస్‌కు ప్రశంసల వెల్లువ..