Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వైన్ ఫ్లూకి, హెచ్3ఎన్2కి మధ్య తేడా ఏంటి? రెండింటికీ ఒకే లక్షణాలు.. మరి గుర్తించడం ఎలా?

ఇన్‌ఫ్లూ ఎంజా H3N2 ఇన్‌ఫెక్షన్ అనేది H1N1(స్వైన్ ఫ్లూ) కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి, సాధారణ అనారోగ్యం, గొంతు నొప్పి వంటి ఇతర లక్షణాలు రెండింటిలోనూ ఒకేలా కనిపిస్తాయి. 

స్వైన్ ఫ్లూకి, హెచ్3ఎన్2కి మధ్య తేడా ఏంటి? రెండింటికీ ఒకే లక్షణాలు.. మరి గుర్తించడం ఎలా?
Virus
Follow us
Madhu

|

Updated on: Mar 17, 2023 | 6:30 PM

H3N2 virus vs H1N1 virus: కోవిడ్ తర్వాత అదే లక్షణాలతో భయపెడుతోంది హెచ్3ఎన్2 వైరస్. క్రమ క్రమంగా దేశ అంతటా విస్తరిస్తోంది. ఈ సమయంలో చాలా మందిలో భయాందోళనలు మొదలవుతున్నాయి. వారికి వస్తున్న లక్షణాలను బట్టి అది కరోనానా.. లేక హెచ్3 ఎన్2 ఇన్ ఫ్లూఎంజానా లేక స్వైన్ ఫ్లూ నా అనేది నిర్ధారించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. హెచ్3ఎన్2 అనేది సీజనల్ ఇన్ ఫ్లూ ఎంజా ఫ్లూ. ఇది అంటువ్యాధిగా పరిగణించబడుతుంది. ప్రజలలో దీర్ఘకాలిక అనారోగ్యానికి కారణమవుతుంది. దీని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తదితర విషయాలను తెలుసుకుందాం..

హెచ్3ఎన్2 లక్షణాలు ఇవి..

హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా వల్ల కలిగే లక్షణాలు వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పి, గొంతు నొప్పి, తీవ్రమైన, నిరంతర దగ్గు, జలుబు, ఊపిరితిత్తులలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నాయి. ఇవికాక కొందరిలో ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు లేదా అతిసారం ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. 3-5 రోజుల పాటు ఉండే జ్వరం, మూడు వారాల వరకు సుదీర్ఘమైన దగ్గు జలుబుకు కారణమవుతుందని వివరిస్తున్నారు. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించినా.. బీపీ డౌన్ అయినా, అధిక శ్వాస తీసుకోవడం, నీలిరంగు పెదవులు, మూర్ఛలు, గందరగోళం ఉంటే, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే..

ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులు, గర్భిణులు, ఆస్తమా, మధుమేహం, గుండె జబ్బులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వారు నరాల వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారు దీనికి గురయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది స్వైన్ ఫ్లూ కంటే తీవ్రమైనది..

ఇన్‌ఫ్లుఎంజా A H3N2 ఇన్‌ఫెక్షన్ అనేది A H1N1(స్వైన్ ఫ్లూ) లేదా B కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. మైయాల్జియా,జ్వరం, తలనొప్పి, సాధారణ అనారోగ్యం, గొంతు నొప్పి వంటి ఇతర లక్షణాలు ఇన్ఫ్లుఎంజా A H3N2, A H1N1 మరియు B ఇన్ఫెక్షన్లలో సమానంగా తరచుగా కనిపిస్తాయి. H3N2, H1N1 వైరస్‌లను ప్రయోగశాల పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. ఈ పరీక్ష విధానం కూడా కోవిడ్-19 పరీక్షను పోలి ఉంటుంది. ఆర్టీపీసీఆర్ ద్వారా నిర్ధారించవచ్చు.

ఈ జాగ్రత్తలు పాటించాలి..

ప్రజలు మాస్క్ లు ధరించాలని, చేతి పరిశుభ్రతను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ప్రాణాంతకమైనది కాకపోయినప్పటికీ జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..