Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Heart: ఆరోగ్యకరమైన గుండె కోసం ఈ 5 ఆహారాలు ఉత్తమం.. అవేంటంటే..

అధిక సోడియం తీసుకోవడం అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటుకు కారణమవుతుంది. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల హైబీపీ, గుండె సమస్యలు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

Healthy Heart: ఆరోగ్యకరమైన గుండె కోసం ఈ 5 ఆహారాలు ఉత్తమం.. అవేంటంటే..
Heart
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 15, 2023 | 2:38 PM

అధిక సోడియం తీసుకోవడం అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటుకు కారణమవుతుంది. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల హైబీపీ, గుండె సమస్యలు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. సోడియం శరీరానికి అవసరమైన పోషకం.. ఇది తక్కువ మొత్తంలో అవసరం. వయసు పెరిగే కొద్దీ రక్తపోటును దృష్టిలో ఉంచుకుని ఉప్పు తీసుకోవడం తగ్గించడం మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. సోడియం తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. మరి సోడియం తక్కువగా ఉండే ఆహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్రెడ్, పిజ్జా, శాండ్‌విచ్‌లు, మాంసాలు, సూప్‌లు, బర్రిటోలు, టాకోస్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. 140 mg లేదా అంతకంటే తక్కువ సోడియం ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఉప్పు లేని ఆహారాలు లేదా తక్కువ సోడియం ఉన్న ఆహారాలు ఆరోగ్యానికి చాలా మంచివి.

ఫైబర్ కంటెంట్..

బీన్స్, బఠానీలు, తృణధాన్యాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్ కంటెంట్‌కు గొప్ప మూలాలు. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాదు.. వీటిలో సహజంగానే కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

పండ్లు..

చాలా పండ్లలో ఉప్పు తక్కువగా ఉంటుంది. సోడియం లేని పండ్లలో యాపిల్స్, ఆప్రికాట్స్, అరటిపండ్లు, ద్రాక్షపండు, నారింజ వంటివి ఉన్నాయి. పండ్లలో సహజంగా సోడియం తక్కువగా ఉంటుంది. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ హృదయాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది.

పెరుగు..

ఆరోగ్యకరమైన ప్రేగులను ప్రోత్సహించడంలో పెరుగు పని చేస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గి్స్తుంది. అనేక పరిశోధనల్లో ఈ విషయం తేలింది. పెరుగును చక్కెర లేదా ఉప్పు కలిపి తినొచ్చు. సాధారణ పెరుగులో సహజంగా సోడియం తక్కువగా ఉంటుంది. సాధ్యమైతే సాదా పెరుగునే తినేందుకు ప్రాముఖ్యతనివ్వండి.

ఉప్పు లేని పప్పులు..

పప్పులు మొక్కల ఆధారిత పోషకాలను కలిగి ఉంటుంది. సంతృప్తికరమైన క్రంచీ స్నాక్స్‌లో ఒకటి. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు, వాల్‌నట్స్ వంటి కొన్ని గింజల్లో ఇవి కనిపిస్తాయి.

బీన్స్, బఠానీలు..

బఠానీలు, బీన్స్ వంటి కూరగాయలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతకు ప్రధాన కారణం ఐరన్ లోపం. శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే, శరీరానికి తగినంత ఆక్సీజన్ అందదు. ఫలితంగా ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇది హిమోగ్లోబిన్ లోపానికి కారణం అవుతుంది. శరీరంలో ఐరన్ పుష్కలంగా ఉంటే.. అలసట ఉండదు. శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.

చిరు ధాన్యాలు..

మధుమేహం, ఊబకాయం, ఇతర జీవనశైలి సంబంధిత వ్యాధులు ఉన్నవారికి చిరు ధాన్యాలు చాలా మంచి చేస్తుంది. తృణధాన్యాలు జీర్ణక్రియకు మద్దతు ఇస్తాయి. ఆకలిని మెరుగుపరుస్తాయి, రక్త లోపం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..