vaccine: పురుషులు ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారా ? అయితే మీరు ఇది తప్పక తెలుసుకోండి
వైరస్ నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే వ్యాక్సినేషన్ షాట్ తీసుకునే ముందు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మనవాళిపై వైరస్ లు పగబట్టినట్లు ఉన్నాయి.. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ నుంచి బయటపడుతున్న వేళ.. మళ్ళీ H3N2 వైరస్ వ్యాప్తిస్తోంది. దేశ వ్యాప్తంగా ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. చాలా మంది వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. వైరస్ నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే వ్యాక్సినేషన్ షాట్ తీసుకునే ముందు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులు టీకా తీసుకోవడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు.
మంచి నిద్ర మనిషిలోని రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. వ్యాక్సిన్ ఇచ్చే రక్షణ వ్యవధిని కూడా పొడిగించవచ్చు” అని చికాగో విశ్వవిద్యాలయ మెడిసిన్ ప్రొఫెసర్ ఎమెరిటస్ సీనియర్ రచయిత ఈవ్ వాన్ కాటర్ అన్నారు. పరిశోధకుల అధ్యయనంలో టీకాకు రోగనిరోధక ప్రతిస్పందనపై నిద్ర ప్రభావం ఉంటుందని కనుగొన్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం మగవారిపై అధికంగా ఉంటుందని చెప్పారు.
“నిద్ర లేమికి సంబంధించిన ఆబ్జెక్టివ్ కొలతల గురించి పరోశోధనలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మగవారిలో నిద్ర లేమి కారణంగా టీకాను ప్రతిస్పందించే సామర్థ్యం తక్కువగా ఉందని కనుగొంది.. అయితే స్త్రీలలో నిద్రలేమికి.. వ్యాక్సిన్ పనితీరుకు ఎటువంటి సంబంధం లేదని అధ్యయన సహ రచయిత డాక్టర్ మైఖేల్ చెప్పారు.




స్వయం ప్రతిరక్షక రుగ్మతల వంటి వైరస్‌లు , స్వీయ-యాంటిజెన్‌ల వంటి విదేశీ యాంటిజెన్‌లకు రోగనిరోధక ప్రతిస్పందనలో లింగ భేదాలు ఉన్నాయని పరిశోధకులు వివరించారు. “సాధారణంగా, ఫ్లూ వ్యాక్సిన్‌తో సహా మహిళలకు సహజమైన బలమైన రోగనిరోధక శక్తి ఉంటుంది” అని న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఫిల్లిస్ జీ చెప్పారు.
ఇందుకు సాక్ష్యంగా స్త్రీ, పురుషుల్లోని ఈ వ్యత్యాసాలు హార్మోన్ల, జన్యు , పర్యావరణ వ్యత్యాసాలను ప్రతిబింబిస్తాయని .. ఇవి జీవితకాలంలో మారవచ్చని తెలిపారు. అయితే ఈ వ్యత్యాసాలు వృద్ధులలో మారవచ్చు అంటూ తెలిపారు.
లింగ బేధం లేకుండా ఎవరైనా నిద్ర లేమి, జెట్-లాగ్‌డ్, నైట్ షిఫ్ట్‌లో పని చేస్తున్నప్పుడు లేదా నిద్ర మేల్కొంటూ ఉండేవారు టీకాను తీసుకోవడంలో జాప్యం చేయవచ్చు అంటూ అధ్యయనంలో పేర్కొన్నారు. అంతేకాదు తాను రోగులకు వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ముందు.. వారు ఉద్యోగస్తులైనా పని చేస్తున్నా.. వారికి నిద్ర సమస్యలు ఉన్నాయా.. ముందు రోజు రాత్రి నిద్ర పోయారా లేదా అనే విషయంపై తాను ఆరా తీస్తానని చెప్పారు డాక్టర్ ఇర్విన్. ఒకవేళ వారు నిద్ర పోకపోతే.. పూర్తిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి రావాలని అప్పుడు నేను వ్యాక్సిన్ ఇస్తానని చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..