AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Protein Powder: కండరాలను పెంచేందుకు ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నారా? అయితే మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి..

యువత ఫిట్ గా ఆకర్షణీయమైన శరీరం కోసం, కఠినమైన వ్యాయామంతో పాటు, ప్రోటీన్ సప్లిమెంట్లను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

Protein Powder: కండరాలను పెంచేందుకు ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నారా? అయితే మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి..
Protien
Madhavi
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 15, 2023 | 10:41 AM

Share

యువత ఫిట్ గా ఆకర్షణీయమైన శరీరం కోసం, కఠినమైన వ్యాయామంతో పాటు, ప్రోటీన్ సప్లిమెంట్లను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ మధ్యకాలంలో యువత భారీ వర్కవుట్‌లతో పాటు ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సరైనదని భావిస్తున్నారు. అయితే ప్రోటీన్ పౌడర్లను తీసుకోవడం శరీరానికి మంచిదేనా? నష్టాలు ఏంటి? సరైన ప్రోటీన్ పౌడర్ ను ఎలా గుర్తించాలి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకుందాం. ప్రొటీన్ పౌడర్ కు సంబంధించిన కొన్ని సూచనలు తెలుసుకుందాం.

ప్రోటీన్ సప్లిమెంట్లను ప్రోటీన్ డైట్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకుంటారు. ఇవి అధిక బరువును తగ్గించడంలో కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడతాయని భావిస్తారు. ఈ ప్రోటీన్ సప్లిమెంట్ పొడులను తయారు చేయడానికి, సోయాబీన్స్, బఠానీలు, బియ్యం, బంగాళదుంపలు లేదా గుడ్లు, పాలు మొదలైన వివిధ వనరుల నుండి ప్రోటీన్ తీసుకొని పౌడర్ తయారు చేస్తారు. దీనికి చక్కెరలు, కృత్రిమ రుచులు, విటమిన్లు మినరల్స్ జోడిస్తారు.

ఈ ప్రోటీన్ సప్లిమెంట్లు పౌడర్లు, షేక్స్ లేదా క్యాప్సూల్స్ రూపంలో వస్తాయి. సాధారణంగా సప్లిమెంట్లలో రెండు రకాల ప్రోటీన్లు ఉంటాయి – కేసిన్ ప్రోటీన్, రెండోది వే ప్రోటీన్

ఇవి కూడా చదవండి

పాలవిరుగుడు నుంచి వే ప్రోటీన్ తీస్తారు. ఇందులో అమైనో ఆమ్లాలు ఉంటాయి. జిమ్‌కు వెళ్లే యువతలో ఎక్కువ మంది ఈ వే ప్రొటీన్‌ను తీసుకుంటారు. ఇది వేగంగా జీర్ణమయ్యే ప్రోటీన్, కానీ ‘వే’ ప్రొటీన్‌లో గ్లోబులర్ ప్రొటీన్ ఉంటుంది. ఇది శరీరానికి ఎక్కువ హాని కలిగిస్తుంది.

ప్రొటీన్ సప్లిమెంట్లను ఎక్కువగా వాడటం శరీరానికి అంత మంచిది కాదు. అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. ప్రొటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. కొన్ని ప్రోటీన్ పౌడర్‌లలో సీసం, కాడ్మియం, ఆర్సెనిక్ పాదరసం వంటి విషపూరిత లోహాలు ఉంటాయి. దీని కారణంగా, తలనొప్పి, అలసట, మలబద్ధకం, కండరాలు, కీళ్లలో నొప్పి వంటి సమస్యలు ఉండవచ్చు.

‘వే’ ప్రొటీన్లలో కొన్ని హార్మోన్లు బయోయాక్టివ్ పెప్టైడ్‌లు ఉంటాయి, ఇవి మొటిమల ప్రమాదాన్ని పెంచుతాయి.కొన్ని ప్రోటీన్ సప్లిమెంట్లలో చక్కెరల రూపంలో అదనపు కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి కొవ్వును తగ్గించే బదులు పెంచుతాయి. కార్డియోవాస్కులర్ గుండె సమస్యల ప్రమాదం కూడా రావచ్చు.

ప్రొటీన్ పౌడర్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల బలహీనత కాలక్రమేణా కిడ్నీ సమస్యలు వస్తాయి. పౌడర్లకు బదులుగా సరైన మొత్తంలో ఆహారం తీసుకోవడం, విటమిన్లు, ఖనిజాలు ఫైబర్ సరైన మొత్తంలో ఉండేలా ఆహారంలో తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

సాధారణంగా జిమ్ వెళ్లే యువకులు తెలిసిన వారి సలహాపై ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇది అస్సలు సురక్షితం కాదు. నిజానికి ప్రొటీన్‌ పౌడర్‌లలో అవసరమైన అన్ని పోషకాలు ఉండవు. అందుకే ఇది చాలా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఏదైనా ప్రోటీన్ పౌడర్ తీసుకునే ముందు పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి.

పాలు, గుడ్లు, చేపలు, పప్పు దినసులు, పండ్లు వంటి సహజ ప్రోటీన్ వనరులతో పోల్చినప్పుడు ప్రోటీన్ పౌడర్‌లు దరిదాపుల్లో సరిపోల్చలేము. సహజ ప్రోటీన్ కోసం మీ ఆహారంలో పాల ఉత్పత్తులను జోడించండి. గుమ్మడికాయ గింజలు, చీజ్, వెన్న, బాదం, పెరుగులో కూడా ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..