AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dieting Tips: డైటింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. తక్కువ టైమ్‌లో మంచి ఫలితాలు..

మారుతున్న జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత తగ్గించడంతో చాలా మంది బరువు పెరగడంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో విషయం తెలసుకున్నాక.. చాలా మంది బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నారు. రోజూ తినే..

Dieting Tips: డైటింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. తక్కువ టైమ్‌లో మంచి ఫలితాలు..
Diet Tips
Amarnadh Daneti
|

Updated on: Nov 12, 2022 | 9:25 AM

Share

మారుతున్న జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత తగ్గించడంతో చాలా మంది బరువు పెరగడంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో విషయం తెలసుకున్నాక.. చాలా మంది బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నారు. రోజూ తినే ఆహారంలో.. తీసుకునే సమయంలో.. పరిమాణంలో అనేక మార్పులు చేసుకుని.. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొంత మంది ఈడైటింగ్ ను పర్ ఫెక్ట్ గా ఫాలో అవుతుంటే మరికొంత మంది ఏదో నామ్ కీ వాస్త్ అన్నట్లు చేస్తున్నారు. అయితే కొంత మంది ప్లాన్ ప్రకారం డైటింగ్ చేస్తున్నా.. ఫలితం మాత్రం కన్పించదు. ఎందుకంటే ఈడైటింగ్ లో కొన్నిసార్లు చిన్న చిన్న లాజిక్ లు మిస్ అవుతూ ఉంటారు. మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ టైమ్ లోనే ఈడైటింగ్ టిప్స్ ను ఫాలో అవుతూఉంటారు. డైటింగ్ చేసే వారు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ టైమ్ లో కొద్దిగా ఎక్కువ ఆహారం తీసుకుంటుంటారు. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువ మొత్తం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోనే చేసేస్తే క్యాలరీలు సమర్థవంతంగా ఖర్చు చేయవచ్చు, తద్వారా బరువు తగ్గించుకోవచ్చు అనే భావన కూడా చాలా మందిలో ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉంది.

అల్పాహారం అంటేనే అల్పంగా, తక్కువ పరిమాణంలో తీసుకునేది అని అర్థం. తాజాగా చేపట్టిన ఒక అధ్యయనం ప్రకారం ఒక రోజులో ఎక్కువ మొత్తంలో ఆహారం ఏ సమయంలో తిన్నప్పటికీ, అది బరువును ఎంత మాత్రం ప్రభావితం చేయదు. అల్పాహారం ఎక్కువ మొత్తంలో తింటే బరువు తగ్గుతారనేది అపోహ మాత్రమేనని తాజా పరిశోధనలో వెల్లడైంది. అందుకే డైటింగ్ చేసేటప్పుడు మన సందేహాలను డైటీషియన్స్ లేదా ఆరోగ్య నిపుణులను అడిగి నివృత్తి చేసుకోవాల్సి ఉంటుంది. వారి సలహాలు, సూచనల ప్రకారం సరైన పద్ధతిలో డైటింగ్ చేస్తే మాత్రం ఆశించిన ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు.

డైటింగ్ పేరుతో ఒకే సమయంలో ఎక్కవు ఆహరం తీసుకోవడం కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చంటున్నారు డైటిషియన్స్. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఎంత పరిమాణంలో ఆహారం తీసుకుంటున్నామో దానికంటే ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనేది ముఖ్యమని చెబుతున్నారు. ఆహారం తినడంలో ప్రతి రోజూ ఒకే సమాయాన్ని ఫాలో అవడం కూడా గుడ్ రిజల్ట్ రావడానికి కారణమవుతుందని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..