AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Golden Poison Frog: మనుషులను చంపే కప్పలను మీరెప్పుడైనా చూశారా..? ఒకేసారి 10 మందిని చంపగలవు

ఈ ప్రపంచంలో వివిధ రకాల విష జంతువులు నివసిస్తాయి. విషపూరితమైన పాములను మనం చూశాము. అయితే విషపూరిత కప్పల గురించి ..

Golden Poison Frog: మనుషులను చంపే కప్పలను మీరెప్పుడైనా చూశారా..? ఒకేసారి 10 మందిని చంపగలవు
Golden Poison Frog
Subhash Goud
|

Updated on: Nov 12, 2022 | 9:07 AM

Share

ఈ ప్రపంచంలో వివిధ రకాల విష జంతువులు నివసిస్తాయి. విషపూరితమైన పాములను మనం చూశాము. అయితే విషపూరిత కప్పల గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ ప్రపంచంలో అలాంటి ఒక కప్ప ఉంది. ఇది చూడటానికి చాలా అందంగా ఉన్నా.. చాలా విషపూరితమైనది. ఈ కప్పలను గోల్డెన్ పాయిజన్ కప్పలు అంటారు. అవి సాధారణంగా రెండు అంగుళాలు లేదా కొంచెం పెద్దవి లేదా చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ కప్పలు పది మందిని చంపేంత విషం ఇందులో ఉండటం గమనార్హం. శతాబ్దాలుగా కొలంబియాలోని వేటగాళ్ళు తమ ఎరను పట్టుకోవడానికి ఈ రకమైన కప్ప విషాన్ని ఉపయోగిస్తారట.

నేషనల్ జియోగ్రాఫిక్ నివేదికల ప్రకారం.. ఈ కప్పలు ఎందుకు విషపూరితమైనవి అనే దానిపై సమాచారం లేదు. అయినప్పటికీ, వాటి విషం ప్రధానంగా మొక్కలు, విషపూరిత కీటకాల నుండి వస్తుందని నమ్ముతారు. అయితే ఇతర ప్రదేశాలలో ఉన్న కప్పలకు ఎలాంటి విషం లేకపోయినా? ఈ కప్పల్లో విషయం ఉండటం భయాందోళన కలిగించే అంశం. ఈ కప్పలను తాకడం కూడా మరణానికి దారితీస్తుంది. వైద్య పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులు ఈ రకమైన కప్పలను వైద్య రంగంలో ఉపయోగించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కప్పలు ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చని వైద్యులు భావిస్తున్నారు. దీని ద్వారా శక్తివంతమైన పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్‌లను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

ఈ మచ్చల కప్పలో 100 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. వాటి సగటు పొడవు ఒక అంగుళం కంటే ఎక్కువ. చాలా కప్ప జాతులు కొలంబియాలోని పసిఫిక్ తీరంలో రెయిన్‌ఫారెస్ట్‌లోని చిన్న పాచ్‌లో నివసిస్తున్నాయి. ఈ కప్పలు తక్కువ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో జీవించగలవు.

ఇవి కూడా చదవండి

ఈ కప్ప రంగు పసుపు, నారింజ లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వివిధ ప్రదేశాలను బట్టి వాటి రంగులు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ కప్పలు వేటాడేవారిపై విష ప్రయోగం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి ప్రధానంగా ఈగలు, చీమలు, చెదపురుగులను తింటాయి. బంగారు పాయిజన్ కప్పల శరీరాలు కూడా విషపూరితమైనవి. ఏదైనా ప్రమాదాన్ని గుర్తించినప్పుడు, చర్మం నుండి విషం విడుదల అవుతుంది. ఆ విషం నేరుగా మానవ చర్మంపై పడినప్పుడు మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఈ కప్పల విషయం మనుషులపై పడినప్పుడు పల్స్‌ రేటు పడిపోయే చనిపోయే ప్రమాదం ఉంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్