గుండె జబ్బులకు ఛూమంత్రం.. ఈ 4 వంట నూనెలు టానిక్ లాంటివంట.. అవేంటంటే..
గుండె జబ్బులను నివారించడానికి లేదా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు ఏ నూనె తీసుకోవాలి..? అనే సందేహాలు తరచూ తలెత్తుతుంటాయి.. అయితే.. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.. అయితే.. ఈ 4 రకాల వంట నూనెలు గుండెకు టానిక్ కంటే తక్కువ కాదని.. రెగ్యులర్ వినియోగం గుండె జబ్బులను దూరంగా ఉంచుతుందని డైటీషియనల్లు చెబుతున్నారు.. అవేంటో తెలుసుకోండి..
ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం గుండె ఆరోగ్యాన్ని బలహీన పరుస్తున్నాయి. అందుకే.. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవడం మంచిది.. దీనికోసం జీవనశైలిని మెరుగుపర్చుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం లాంటివి అవలంభించాలి.. గుండె జబ్బులు చాలా మరణాలకు కారణమవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, గుండెను ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని వంట నూనెలు కూడా ఇందులో చాలా సహాయకారిగా ఉంటాయని.. ఈ విషయంలో అవగాహన అవసరం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గుండె జబ్బులను నివారించడానికి లేదా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు ఏ నూనె తీసుకోవాలి..? అనే సందేహాలు తరచూ తలెత్తుతుంటాయి.. ఈ ప్రశ్నలకు సరైన సమాధానం లభించదు.. కొందరు వ్యక్తులు నూనె రహిత వంట ఆరోగ్యానికి మంచిదని భావించినప్పటికీ, నూనె వాస్తవానికి శరీర పనితీరుకు మద్దతు ఇస్తుంది. అందువల్ల దీన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఏ నూనెలు గుండెకు ప్రయోజనకరంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకోండి..
గుండె ఆరోగ్యానికి మేలు చేసే 4 వంట నూనెల గురించి తెలుసుకోండి..
ఆలివ్ నూనె: NIH నివేదిక ప్రకారం.. ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని తీసుకోవడం కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా, ఈ నూనెలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి వల్ల క్యాన్సర్, డయాబెటిస్, పార్కిన్సన్స్, అల్జీమర్స్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
సోయాబీన్ నూనె: సోయాబీన్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అలాగే గాయాలను నయం చేసే గుణాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు గుండె సంబంధిత సమస్యలను నివారిస్తాయి.
పొద్దుతిరుగుడు నూనె: సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో విటమిన్ ఇ ఉంటుంది. ఇది గుండెకు మేలు చేసే యాంటీఆక్సిడెంట్. సన్‌ఫ్లవర్ ఆయిల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
కనోలా నూనె: అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు లేదా గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులకు కనోలా నూనె ఆరోగ్యకరమైన ఎంపికలలో ఒకటి. ఇందులో ఉండే ఫ్యాట్ సీరం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..