Morning Healthy Diet: ఉదయం నిద్ర లేవగానే వీటిని తింటే అమృతం తీసుకున్నట్లే.. అవేంటో తెలుసా..
Morning Healthy Diet: ఏం తినాలి, ఎంత తినాలి వంటి విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండాలి. ఇలా ఉంటేనే ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. అందుకోసం ఉదయం లేవగానే ఏం తినాలి.. వాటితో మనకు ఉపయోగం ఏంటో తెలుసుకుందాం..
తినడం మానేస్తే బరువు తొగ్గొచ్చని చాలా మంది అనుకుంటారు. ఇది నిజం కాదు. అసలు చెప్పాలంటే.. సరైన ఆహారం తింటే.. ఆటోమేటిక్‌గా బరువు తగ్గగలరు. అయితే.. ప్రతి రోజు సమయానికి ఎదో ఒకటి తీసుకుంటే స్లిమ్‌గా.. హాడ్సమ్‌గా మారొచ్చని న్యూట్రిషియన్లు అంటున్నారు. ఇందులో ముఖ్యమంగా ఎక్సర్‌సైజ్, వర్కవుట్ వంటివి తప్పనిసరిగా చెయ్యాలి. అలాగని అతిగా వర్కవుట్స్ చేయడం కూడా సరి కాదు. ఎక్కువ వర్కవుట్స్ వల్ల బరువు తగ్గడం సంగతేమోగానీ… నీరసం, డీహైడ్రేషన్ వంటివి వచ్చేస్తాయి. ఆకలి పెరిగి… ఇదివరకటి కంటే ఎక్కువ తినేస్తారు. అందుకే.. ఏం తినాలి, ఎంత తినాలి వంటి విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండాలి. ఇలా ఉంటేనే ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. అందుకోసం ఉదయం లేవగానే ఏం తినాలి.. వాటితో మనకు ఉపయోగం ఏంటో తెలుసుకుందాం..
చియా సీడ్స్‌లోని పోషకాలు..
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే చియా విత్తనాలను తినవచ్చు. ఇది బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటుంది. చియా, సబ్జా గింజలు బరువు తగ్గాలనుకునేవారికి రెండు మంచి ఆహారాలు. ఈ రెండిటిలో చాలా పోషకాలు ఉంటాయి. చియా విత్తనాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. గ్లూటెన్ ఉండదు. మీరు చియా పుడ్డింగ్‌లా తినొచ్చు, మీరు తినే సలాడ్ , జ్యూస్‌లో చియా విత్తనాలను వేసుకుని తినొచ్చు. ఇలా తినడం వల్ల చియా విత్తనాలలోని పోషకాల ప్రయోజనాలను మీరు పొందొచ్చు. చియా విత్తనాలలో 6 శాతం నీరు, 46 శాతం కార్బోహైడ్రేట్లు, 34 శాతం కొవ్వు మరియు 19 శాతం ప్రోటీన్ ఉంటుంది. 28 గ్రాముల చియా విత్తనాలలో 138 కేలరీలు ఉంటాయి.
యాపిల్ రహస్యమిదే.. పరగడుపునే తింటే ఆ సమస్యలే దరిచేరవు..
యాపిల్ రహస్యమిదే.. పరగడుపునే తింటే ఆ సమస్యలే దరిచేరవు.. ఆపిల్ ఉదయం ఖాళీ కడుపుతో తినవచ్చు. యాపిల్‌లో ఐరన్, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక యాపిల్ తింటే.. డాక్టర్ దగ్గరికి వెళ్లే అవకాశమే రాదంటూ పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. అయితే.. ఉదయం పూట పరగడుపున యాపిల్ తింటే చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. యాపిల్స్‌లో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. అందుకే ఉదయాన్నే ఆపిల్ తినడం వల్ల రోజంతా శరీరానికి శక్తి లభిస్తుంది. ఈ సందర్భంలో ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఉసిరికాయలతో బోలెడన్ని ప్రయోజనాలు..
ఉసిరికాయను ఉదయం నిద్రలేచిన తర్వాత తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరికాయలో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి. ఉసిరికాయ తింటే రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఎంతగానో అడ్డుకుంటుంది. ఉసిరి పొడిని ప్రతిరోజు కూడా తీసుకుంటూ ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలను ఈజీగా తొలగిస్తుంది. ఈ పొడిలో కొద్దిగా తేనె కూడా కలిపి తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 10 గ్రాముల ఉసిరి గింజలను ఎండలో ఎండబెట్టి ఇంకా వాటిని మెత్తగా పొడిగా చేసుకోవాలి. అలాగే అందులో 20 గ్రాముల చెక్కెర పొడిని కలిపి ఉంచుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో 1 గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ పొడిని కలిపి 15 రోజుల పాటు రోజూ తీసుకోవాలి. ఇలా చేస్తే నిద్రలేమి నుండి బయట పడవచ్చు
ఉదయం ఖాళీ కడుపుతో తేనె..
ఉదయం పూట తేనెను తీసుకోవడం వల్ల మీ మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.తేనెను కేవలం శక్తిని ఇవ్వడానికి మాత్రమే కాకుండా అనేక జీవక్రియలకు అవసరం. ఎందుకంటే చక్కెర కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. బ్యాక్టీరియాని చంపేస్తుంది. కిలో తేనెలో నీటి శాతాన్ని బట్టి సుమారుగా 3150–3350 కేలరీలు ఉంటాయి. శరీర ఎదుగుదలకు అవసరమైన విభిన్న పదార్థాలు 80కి పైగా తేనెలో వున్నాయి. ఎన్ జైములు అధికంగా ఉండే ఆహార పదార్ధాల్లో తేనె ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.
ఓట్స్‌ను అల్పాహారంగా తీసుకోవచ్చు. నెవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అనేది వైద్యులు చెప్పే మొదటి మాట. ఎందుకంటే రోజులో తీసుకోవల్సిన అత్యవసర ఆహారం అది. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పుడూ సరైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలి. ఫలితంగా రోజు మొత్తం ఎనర్జీను కొనసాగించడంలో దోహదపడుతుంది. అదే సమయంలో మీ శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. అందుకే బరువు తగ్గించగలిగే బ్రేక్‌ఫాస్ట్ ఎంచుకుంటే చాలా మంచిది. దీనికి సమాధానమే ఓట్స్.
బొప్పాయి తినవచ్చు..
ఉదయం నిద్రలేచిన తర్వాత బొప్పాయి తినవచ్చు. ఇది జీర్ణక్రియకు మంచిది. మీకు అకాల ఆకలి అనిపిస్తే, మీరు బొప్పాయి తినవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్(cancer) వంటి తీవ్రమైన సమస్యలు శరీరానికి దూరంగా ఉంటాయి. బొప్పాయిలో ఫైబర్, కెరోటిన్, విటమిన్ సి, (Vitamin సి) ఇ, ఎ అనేక ఇతర ఖనిజాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనవి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)