Health Tips: ఈ సమస్యలు మీకున్నాయా.. అయితే మీరు పసుపు తినకూడదు.. లేదంటే తీవ్ర ఇబ్బందులు తప్పవు..!

పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, కొన్ని సందర్భాల్లో, పసుపు మన శరీరానికి విషంలా హాని చేస్తుంది.

Health Tips: ఈ సమస్యలు మీకున్నాయా.. అయితే మీరు పసుపు తినకూడదు.. లేదంటే తీవ్ర ఇబ్బందులు తప్పవు..!
Turmeric Tea3
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 02, 2022 | 8:45 AM

Turmeric: పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. కానీ, కొన్ని సందర్భాల్లో, పసుపు మన శరీరానికి విషంలా హాని చేస్తుంది. అందుకే మన శరీరం పసుపును ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు అని మీరు తెలుసుకోవాలి. ఏ వ్యక్తులు పసుపు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ పేషెంట్లు- మధుమేహం కోసం చికిత్స పొందుతున్న వారికి సాధారణంగా రక్తం పల్చగా ఉండే మందులను ఇస్తారు. దీనితో పాటు, రక్తంలో చక్కెర పరిమాణం కూడా నియంత్రించేలా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ వ్యక్తులు ఎక్కువ పరిమాణంలో పసుపును తీసుకుంటే, రక్త పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి హానికరం.

కామెర్లు- కామెర్లతో బాధపడుతున్న వారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. మీ జబ్బు నయమైన తర్వాత కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే పసుపును తీసుకోవాలి. లేకపోతే మీ ఆరోగ్యం మరింత దిగజారే ఛాన్స్ ఉంది.

కిడ్నీలో రాళ్లు- తరచుగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య ఉన్నవారు వైద్యుల సలహా తర్వాతే పసుపును తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.

రక్తస్రావం సమస్య- ముక్కు నుంచి అకస్మాత్తుగా లేదా నిరంతరాయంగా రక్తస్రావం సమస్య ఉన్నవారు పసుపును పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. దీనితో పాటు, ఇతర రక్తస్రావం సమస్య లేదా వ్యాధి ఉన్నవారు కూడా పసుపు తినకూడదు. లేదా చాలా తక్కువ పరిమాణంలో తినాలి. ఎందుకంటే పసుపు రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదిస్తుంది.

Also Read: Vaccination: టీకా తీసుకున్నాక పిల్లల్లో ఈ సమస్యలుంటే భయపడవద్దు.. వైద్యుడి సలహా తీసుకోండి..

India Omicron: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..