AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mood Booster: తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతున్నారా? ఈ పండ్లు తింటే ఒత్తిడి చిత్తవుతుంది..!

బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. ప్రస్తుత సమాజంలో చాలా మంది తీవ్రమైన ఒత్తిడి జీవితం గడుపుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతున్నారు. చిరాకు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి,

Mood Booster: తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతున్నారా? ఈ పండ్లు తింటే ఒత్తిడి చిత్తవుతుంది..!
Mood Booster Foods
Shiva Prajapati
|

Updated on: May 06, 2023 | 9:23 AM

Share

బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. ప్రస్తుత సమాజంలో చాలా మంది తీవ్రమైన ఒత్తిడి జీవితం గడుపుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతున్నారు. చిరాకు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి కొన్ని సహజ పద్ధతులు ఉన్నాయి. వాటిని ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని పండ్లు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా ఉపకరిస్తాయి. మరి ఆ ఫండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అరటిపండు..

అరటిపండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది అమైనో ఆమ్లం. ఇది సెరోటోనిన్‌గా మారుతుంది. మానసిక స్థితిని మెరుగుపరచడానికి అరటిపండ్లను తినవచ్చు. అవి ఒత్తిడిని దూరం చేస్తాయి. ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటు స్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.

బెర్రీస్..

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్‌ బెర్రీస్ కూడా తినవచ్చు. ఈ బెర్రీలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. బెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. బెర్రీలను చిరుతిండిగా కూడా తినవచ్చు. ఇది ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి

నారింజ..

నారింజలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది కార్టిసాల్ అంటే ఒత్తిడి హార్మోన్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఫోలేట్, విటమిన్ బి కూడా ఉంటుంది. ఇవి ఒత్తిడిని నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తుంది. దీంతో పాటు, నారింజ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

అనాస..

పైనాపిల్‌లో బ్రోమెలైన్, విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుంది. ఇది డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
అది మాత్రమే అసలైన టీ అని ధృవీకరించిన FSSAI!
అది మాత్రమే అసలైన టీ అని ధృవీకరించిన FSSAI!
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే