Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ జీవక్రియ మెరుపడగాలంటే వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి.. త్వరగా బరువు కూడా తగ్గొచ్చు..!

ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగడాని ప్రధాన కారణం సరికాని జీవనశైలి, చెడు ఆహారం తినడం. వీటికారణంగా జీవక్రియ పనితీరు మందగిస్తుంది. దాని ఎఫెక్ట్‌తో బరువు పెరగడంతో పాటు..

Health Tips: మీ జీవక్రియ మెరుపడగాలంటే వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి.. త్వరగా బరువు కూడా తగ్గొచ్చు..!
Masala Food
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 08, 2023 | 6:41 AM

ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగడాని ప్రధాన కారణం సరికాని జీవనశైలి, చెడు ఆహారం తినడం. వీటికారణంగా జీవక్రియ పనితీరు మందగిస్తుంది. దాని ఎఫెక్ట్‌తో బరువు పెరగడంతో పాటు.. శరీరంలో అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అయితే, బరువు తగ్గడానికి మెరుగైన జీవక్రియ చాలా ముఖ్యం. మరి జీవక్రియ మెరుగవ్వాలంటే.. ఆహారంలో కొన్ని పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో కొన్ని మసాలా దినుసులను చేర్చుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఈ సుగంధ ద్రవ్యాలు తినడం ద్వారా వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతాయి. మసాలా దినుసుల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచడంతో పాటు ఆరోగ్యానికి అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.

దాల్చిన చెక్క: దాల్చిన చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీతో పాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. దాల్చిన చెక్క తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. దాల్చిన చెక్క జీవక్రియను ఆరోగ్యంగా మారుస్తుంది. కూరలో దాల్చిన చెక్కను వేసుకోవచ్చు.

ఎర్ర మిరపకాయ: ఎర్ర మిరపకాయల్లో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇందులో థర్మోజెనిక్ లక్షణాలు ఉంటాయి. కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. ఎర్ర మిరపకాయను తినడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు, ఎర్ర మిరపకాయ వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఫెన్నెల్: ఫెన్నెల్ శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. సోంపులో విటమిన్ ఎ, సి, డి పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మెంతికూర: మెంతికూరలో ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. ఇక ఇందులో ఉండే లక్షణాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఏలకులు: ఏలకులు ఉబ్బరం, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది.

నల్ల మిరియాలు: పెప్పర్‌లో పెపెరిన్ ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. వేగంగా బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది.

పసుపు: పసుపులో కర్కుమిన్ ఉంటుంది. పసుపులో ఉండే గుణాలు వేగంగా బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే చాలా మంది తమ వంటల్లో పసుపును తప్పనిసరిగా వినియోగిస్తారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..