Diabetes in Women: మహిళల్లో మధుమేహం.. చాలా ప్రమాదకరం.. ఎందుకో తెలుసా?
మహిళ్లలో షుగర్ అనేది ఓ జీవన శైలి వ్యాధి మాత్రమే కాదని వారు వివరిస్తున్నారు. దీని కారణంగా ఇతర ప్రమాదకర వ్యాధులు కూడా వస్తాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత ఇబ్బందులు అధికమవుతాయని చెబుతున్నారు. పురుషులతో పోల్చితే షుగర్ కలిగిన మహిళలు నాలుగురెట్లు గుండె జబ్బులకు లోనయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

డయాబెటిస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దీని బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. పరుషులు, మహిళలు అన్న తేడా లేకుండా అందరినీ చుట్టుముట్టేస్తోంది. అయితే దీనిని నియంత్రణకు పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని, నిరంతర పర్యవేక్షణ కూడా చేయాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మహిళ్లలో షుగర్ అనేది ఓ జీవన శైలి వ్యాధి మాత్రమే కాదని వారు వివరిస్తున్నారు. దీని కారణంగా ఇతర ప్రమాదకర వ్యాధులు కూడా వస్తాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత ఇబ్బందులు అధికమవుతాయని చెబుతున్నారు. పురుషులతో పోల్చితే షుగర్ కలిగిన మహిళలు నాలుగురెట్లు గుండె జబ్బులకు లోనయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాక కిడ్నీ వ్యాధులు, పలు మానసిక సమస్యలు కూడా మధుమేహం ఉన్న మహిళ్లో అధికంగా ఉంటాయని పలు అధ్యయనాలు వెల్లడిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు షుగర్ పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం.
మహిళల్లోనే ఎందుకు అధికం..
కొన్ని అధ్యయనాల ప్రకారం మహిళలు వారు నివసించే వాతావరణ పరిస్థితులు, జీవన శైలిని బట్టి మధుమేహం బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆఫ్రిక్ అమెరికన్, హిస్పానిక్, అమెరికన్ ఇండియన్, ఆసియన్ ఫసిఫిక్ ద్వీపాలకు చెందిన మహిళలు శ్వేత జాతి మహిళలకంటే అధికంగా మధుమేహం బారిన పడుతున్నారు. పరిశోధన ప్రకారం రక్తంలో షుగర్ కంట్రోల్ లో లేకపోవడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ కు శరీరం స్పందించే తత్వం తగ్గిపోతుంది. ఫలితంగా స్త్రీలలో సెక్స్ పట్ల ఆసక్తి కూడా సన్నగిల్లుతుంది. అలాగే ఇన్సులిన్ సెన్సివిటీ కూడా మహిళల్లోనే అధికంగా ఉంటుంది. శరీరంలో శక్తి సమతుల్యత, గ్లూకోజ్ మెటబోలిజమ్ అనేది స్త్రీ, పురుషులలో విభిన్నంగా ఉంటుంది. ఫలితంగా షుగర్ కి మహిళలు అధికంగా ఇబ్బందులు పడతారు.
మహిళలకు వచ్చే ఇబ్బందులు..
చాలా మంది మహిళలు రక్తంలో షుగర్ వల్ల సహజంగా వచ్చే ఇబ్బందులే కాకుండా కొన్ని ప్రత్యేక మైన ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారు. వాటిల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, రుతు చక్రం దెబ్బతినడం, పాలిసిప్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్) వంటి ప్రమాదాలు కూడా సంభవిస్తాయి.
ఇవి కారణాలు..
మహిళలకు సాధారణంగా టైప్ 2 డయాబెటిస్ అధికంగా వస్తుంది. వాటికి గల కారణాలను పరిశీలిస్తే.. 40 ఏళ్లు పైబడిన వారు, అధిక బరువున్నవారు, వారి కుటుంబంలో తల్లిదండ్రులు లేదా తోబుట్టువులకు షుగర్ ఉన్నవారు, గర్భధారణ సమయంలో, అధికంగా కొలెస్ట్రాల్, పీసీఓఎస్ తో బాధపడుతున్న వారు, శారీరకంగా చురుకైన జీవన శైలి లేని వారు త్వరగా మధుమేహం బారిన పడతారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..