Health Tips: ఉదయాన్నే మీ శరీరాన్ని ఈ సమస్యలు వేధిస్తున్నాయా? ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.. కారణమేంటంటే..

గత కొన్ని నెలలుగా దేశంలో గుండెపోటు కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. చాలామంది చిన్నవయసులోనే గుండెపోటుకు గురవుతూ మృత్యువాత పడుతున్నారు.

Health Tips: ఉదయాన్నే మీ శరీరాన్ని ఈ సమస్యలు వేధిస్తున్నాయా? ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.. కారణమేంటంటే..
Heart
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 22, 2022 | 6:25 AM

గత కొన్ని నెలలుగా దేశంలో గుండెపోటు కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. చాలామంది చిన్నవయసులోనే గుండెపోటుకు గురవుతూ మృత్యువాత పడుతున్నారు. ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా అకస్మాత్తుగా అక్కడికక్కడే కుప్పకూలి మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అంతే కాకుండా గుండె జబ్బులు పెరగడానికి కరోనా వైరస్ కూడా ఒక ప్రధాన కారణం.

గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని, అయితే గుండె జబ్బుల లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స చేస్తే గుండెపోటును నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ చిన్మయ్ గుప్తా ప్రకారం.. ప్రజలు గుండె జబ్బుల పట్ల శ్రద్ధ చూపరని, లక్షణాలు కనిపించినా చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటున్నారు. గుండెపోటు రోగులు చాలా ఆలస్యంగా ఆసుపత్రికి చేరుకోవడానికి ఇదే కారణమంటున్నారు. నేటి కాలంలో 20 ఏళ్లు పైబడిన వారు కూడా గుండెను పరీక్షించుకోవాలని డాక్టర్ గుప్తా సూచిస్తున్నారు. ఇందుకోసం కొలెస్ట్రాల్ పరీక్ష, CT స్కాన్ చేయించుకోవాలి. అంతే కాకుండా శరీరంలో వచ్చే కొన్ని సమస్యల ద్వారా కూడా గుండె జబ్బులను గుర్తించవచ్చునని చెబుతున్నారు డాక్టర్ గుప్తా. మరి ఆ సమస్యలు, లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండండి..

బిపి/అధికరక్తపోటు: ఉదయం నిద్రలేచిన వెంటనే బీపీ పెరిగిపోతుంటే, అది గుండె జబ్బు ప్రధాన లక్షణంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆకస్మికంగా చెమటలు పట్టడం: ఉదయం పూట ఎటువంటి కారణం లేకుండా చెమటలు పడుతూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఛాతీ నొప్పి: ఉదయాన్నే తరుచుగా ఛాతి నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయొద్దు. చాలా మంది దానిని గ్యాస్ సమస్యగా భావిస్తారు, అయితే ఇది గుండెపోటు లక్షణం కూడా కావచ్చు.

వాంతులు: నిద్రలేచిన వెంటనే వాంతులు వస్తే, అది కడుపు సంబంధిత సమస్య కాదు. వెంటనే గుండె పరీక్ష కూడా చేయించుకోవాలి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి..

గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ గుప్తా చెబుతున్నారు. ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు చేర్చుకోవాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు మొత్తాన్ని తక్కువగా ఉంచాలి. బయట లభించే ఆహారాన్ని తినడం మానుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ప్రతి మూడు నెలలకోసారి గుండె పరీక్ష చేయించుకోవాలి. మధుమేహం, ఊబకాయం లేదా బిపి సమస్య ఉంటే ప్రత్యేక శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ ఉండాలి.

ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..