Evening Walk: సాయంత్రం వేళ వాకింగ్ చేస్తున్నారా? ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి..!
చాలా మంది ఉదయం లేవగానే వాకింగ్‌కు వెళ్తుంటారు. అయితే, కొందరు సమయం లేకపోవడంతో సాయంత్రం సమయంలో వాకింగ్ చేస్తుంటారు. సాయంత్రం వాకింగ్ అన్ని వయసుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే, సాయంత్రం వాకింగ్ చేసే వారు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలని,

చాలా మంది ఉదయం లేవగానే వాకింగ్‌కు వెళ్తుంటారు. అయితే, కొందరు సమయం లేకపోవడంతో సాయంత్రం సమయంలో వాకింగ్ చేస్తుంటారు. సాయంత్రం వాకింగ్ అన్ని వయసుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే, సాయంత్రం వాకింగ్ చేసే వారు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలని, వాటిని అనుసరించాలని సూచిస్తున్నారు నిపుణులు. మరి ఆ సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాయంత్రం వాకింగ్ చేసే వారు తెలుసుకోవాల్సిన 7 విషయాలు..
1. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాయంత్రం వ్యాయామం చేయడం, నడవడం శరీర కండరాలకు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో ఒత్తిడి లేని నడకను ఆస్వాదిస్తారు. రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల కూడా బాగా నిద్ర పడుతుంది. ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలి తగ్గుతుంది. దీని వల్ల శరీర బరువు కూడా త్వరగా తగ్గుతుంది.
2. సాయంత్రం వాకింగ్ చేయడం ద్వారా బరువు తగ్గాలనుకుంటే.. దాని కోసం నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకోవాలి. మొదట్లో ఒక అరగంట సేపు నడిచి.. ఆ తర్వాత సమయాన్ని పెంచాలి.




3. ఈవెనింగ్ వాక్ కోసం వెళ్లినప్పుడల్లా, మొదటి కొన్ని నిమిషాలు వేగాన్ని తగ్గించాలి. ఆ తరువాత శరీరం వేడెక్కినప్పుడు.. వేగాన్ని పెంచాలి. చురుకైన నడక కొవ్వును వేగంగా కరిగిస్తుంది. తద్వారా బరువు తగ్గుతుంది.
4. బరువు తగ్గడం కోసం వాకింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ఫిట్‌నెస్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. క్రమంగా నడక సమయాన్ని అరగంటకు పెంచాలి. వాకింగ్ ప్రారంభించే ముందు బరువు ఎంత ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఆ తరువాత ప్రతివారం ఎంత నడిచారో చెక్ చేసుకోవాలి. అలాగే మీ బరువును కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి.
5. సాయంత్రం వాకింగ్ కు వెళ్లిన ప్రతిసారీ అలసటగా అనిపిస్తే కాస్త విశ్రాంతి తీసుకోండి. ఎక్కడైనా కూర్చుని లోతైన శ్వాస తీసుకుంటూ రెండు లేదా మూడు గ్లాసుల నీరు త్రాగాలి. ఇది ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
7. వాకింగ్‌కు వెళ్లాలనుకునే వారు సరైన షూస్, సౌకర్యవంతమైన డ్రెస్ ధరించాలి. దీంతో మీరు సౌకర్యవంతంగా ఈవినింగ్ వాకింగ్ చేయవచ్చు. తద్వారా త్వరగా బరువు తగ్గవచ్చు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




