Jack Fruit: ఈ 2 రకాల వ్యాధులు ఉన్నాయా? అయితే పనస పండు జోలికి వెళ్లొద్దు! ఎందుకో తెలుసా?
ఆరోగ్యానికి పనస పండు ఎంతో మేలు చేస్తుంది, కానీ అందరికీ కాదు. ఇది రక్తం లోని చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచడమే కాకుండా, కొన్ని మందులతో కూడా వికటించవచ్చు. గర్భిణీలు, కిడ్నీ బాధితులు పనస పండు విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఇది శాస్త్రీయంగా నిరూపితమై విషయం. అయితే ఈ పండు చేటు చేసేది ఎలాంటి సమస్యలు ఉన్నవారికో ఇప్పుడు తెలుసుకుందాం..

పనస పండు తొనలంటే ఎవరికి ఇష్టం ఉండదు.. కానీ, ఆ తియ్యటి రుచి వెనుక కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయి. పనస పండులోని కొన్ని సహజ సమ్మేళనాలు కొందరి శరీరతత్వానికి వికటించవచ్చు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా అలర్జీలు ఉన్నవారు ఈ పండును ముట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. పనస పండు ఎవరికి శత్రువుగా మారుతుందో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
1. లాటెక్స్ అలర్జీ ఉన్నవారు: పనస పండులో ఉండే కొన్ని సమ్మేళనాలు సహజ లాటెక్స్‌ను పోలి ఉంటాయి. కాబట్టి, లాటెక్స్ అలర్జీ ఉన్నవారికి పనస పండు తింటే దురద, వాపు, వికారం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. దీనిని ‘లాటెక్స్-ఫ్రూట్ సిండ్రోమ్’ అంటారు.
2. మధుమేహం ఉన్నవారు: పనస పండులో ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కూడా ఎక్కువే. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవడం లేదా వైద్యుల సలహా పాటించడం ఉత్తమం.
3. కిడ్నీ సమస్యలు ఉన్నవారు: పనస పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కిడ్నీ పనితీరు మందగించినప్పుడు శరీరం అధిక పొటాషియంను బయటకు పంపలేదు. ఇది ‘హైపర్‌కలేమియా’కు దారితీసి కండరాల బలహీనత, గుండె లయ తప్పడం వంటి ప్రమాదకర పరిస్థితులను కలిగిస్తుంది.
4. జీర్ణక్రియ సున్నితంగా ఉండేవారు: పనస పండులో పీచు పదార్థం (Fiber) చాలా ఎక్కువ. ఇది జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ, సున్నితమైన కడుపు ఉన్నవారికి లేదా ఐబీఎస్ (IBS) ఉన్నవారికి కడుపు ఉబ్బరం, గ్యాస్, తిమ్మిర్లు లేదా విరేచనాలకు దారితీస్తుంది.
5. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు: పనస పండు తింటే ప్రమాదం అని శాస్త్రీయంగా నిరూపణ కాకపోయినప్పటికీ, ఇందులో ఉండే విరేచనకారి గుణాలు అధిక ఫైబర్ గర్భిణీలలో కడుపు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. గర్భధారణ సమయంలో మధుమేహం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
గమనిక: ఈ కథనంలో అందించిన విషయాలు కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది కేవలం సమాచారం మాత్రమే, దీనికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు.
