కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేసి 16 మందిపై దాడి చేశాయి. వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. గాయపడ్డవారిని రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పిచ్చి కుక్కల బెడదపై ఫిర్యాదులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.