Actor : సినిమా అట్టర్ ప్లాప్.. రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
సాధారణంగా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు డిజాస్టర్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీంతో నిర్మాతలు తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు. అలాగే పలువురు హీరోలు సైతం తాము తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడం లేదా.. నిర్మాతలకు సాయం చేయడం చూస్తుంటాం. ఇప్పుడు ఓ హీరో సైతం తాను తీసుకున్న రూ.15 కోట్ల పారితోషికాన్ని వెనక్కు ఇచ్చారట.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ డమ్ అందుకుంటున్న హీరో కార్తిక్ ఆర్యన్. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. డిసెంబర్ 2025లో ‘తు మేరీ మే తేరా మే తేరా తు మేరీ’ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. ఇందులో అనన్య పాండే కథానాయికగా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. దీని కారణంగా నిర్మాతలు నష్టపోయారు. అందుకే, కార్తీక్ ఆర్యన్ తన వాటా అయిన 15 కోట్ల రూపాయలను (రెమ్యునరేషన్) వదులుకోవాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. ధర్మ ప్రొడక్షన్స్’ ద్వారా కరణ్ జోహార్ ‘తు మేరీ మే తేరా మే తేరా తు మేరీ’ చిత్రాన్ని నిర్మించారు.
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ , అనన్య పాండేలతో పాటు, నీనా గుప్తా , జాకీ ష్రాఫ్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ‘తు మేరీ మే తేరా మే తేరా తు మేరీ’ సినిమాను 90 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీని కారణంగా నిర్మాత కరణ్ జోహార్ నష్టపోయారు. నిర్మాత నష్టాలను తగ్గించడానికి కార్తీక్ ఆర్యన్ తన 15 కోట్ల పారితోషికాన్ని వదులుకున్నట్లు సమాచారం.
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
కార్తీక్ ఆర్యన్ , కరణ్ జోహార్ మధ్య 2021 లో విభేదాలు వచ్చాయి. కానీ 2023 నాటికి వారి మధ్య గొవడలు తగ్గి.. ఇప్పుడు ఇద్దరూ కలిసి పనిచేయడం ప్రారంభించారు. కానీ ‘తు మేరీ మే తేరా మే తేరా తు మేరీ’ సినిమా వైఫల్యం కారణంగా వారి మధ్య మళ్ళీ విభేదాలు ప్రారంభమయ్యాయని పుకార్లు వచ్చాయి. వారి సన్నిహిత వర్గాలు ఆ రూమర్లను ఖండించాయి. మరోవైపు బాక్సాఫీస్ వద్ద ధురంధర్ సినిమా దూసుకుపోతుండగా.. మేరీ మేరీ తేరా మే తేరా తు మేరీ’ ఆ మూవీతో పోటి పడలేకపోయిందని టాక్.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
