AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‌Health Tips: దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? ఈ 4 పద్ధతులు మీకోసమే..

చాలా మంది నోటికి సంబంధించిన సమస్యలను పెద్దగా పట్టించుకోరు. అయితే, కాలక్రమేణా, ఈ సమస్యలు మీ దంతాలు, చిగుళ్ళను మరింత తీవ్రతరం చేస్తాయనడంలో సందేహం లేదు.

‌Health Tips: దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? ఈ 4 పద్ధతులు మీకోసమే..
Brushing Teeth Everyday
Venkata Chari
|

Updated on: Feb 20, 2022 | 8:28 AM

Share

Teeth And Gum Problems: పోషకాహారం, వ్యాయామం ద్వారా మీరు మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటారు. అయితే, ఆందోళన, ఒంటరితనాన్ని దూరంగా ఉంచడం ద్వారా కూడా మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. అయితే మీరు ఎప్పుడైనా మీ దంతాల ఆరోగ్యంపై(Health) శ్రద్ధ పెట్టారా? చాలా మంది నోటికి సంబంధించిన సమస్యలను పెద్దగా పట్టించుకోరు. అయితే, కాలక్రమేణా, ఈ సమస్యలు మీ దంతాలు, చిగుళ్ళను మరింత తీవ్రతరం చేస్తాయనడంలో సందేహం లేదు. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే 4 ఆయుర్వేద పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం.

1. నాలుక శుభ్రపరుచుకోవడం.. పళ్లను శుభ్రం చేసుకున్నట్లే నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. నాలుకపై అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. బ్రష్ చేసిన వెంటనే మనం నాలుకను శుభ్రం చేసుకోవాలి. అంతే కాకుండా చాక్లెట్లు, కేకులు వంటి జిగురుగా ఉండే వాటిని తిన్న తర్వాత కూడా నాలుకను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్లాస్టిక్‌కు బదులుగా మెటల్ టంగ్ క్లీనర్‌ని ఉపయోగించండి.

2. ఆయిల్ పుల్లింగ్.. నోటిలో నీటితో పుక్కిలించడంతో పాటు, నూనెతో పుక్కిలించడం కూడా దంత ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో దంతాలు, చిగుళ్లలో దాగి ఉన్న క్రిములు తొలగిపోతాయి. నోటి పుండ్లను తొలగించడానికి కూడా ఈ పద్ధతి ప్రభావవంతంగా ఉంటుంది. ఇది నోటికి వ్యాయామం, కండరాలను బలపరుస్తుంది. మీరు ఆయిల్ పుల్లింగ్ కోసం కొబ్బరి, నువ్వులు, ఆవాల నూనెను ఉపయోగించవచ్చు. 15-20 నిమిషాలు నూనెతో పుక్కిలించి ఉమ్మివేయండి.

3. సహజ మౌత్ వాష్.. మార్కెట్ నుంచి మెడికల్ మౌత్ వాష్ కొనడం కంటే సహజమైన మౌత్ వాష్ ఉపయోగించడం మంచిది. త్రిఫల, మూలేతి ఆయుర్వేదంలో చాలా మంచి మౌత్ రిన్సర్‌లుగా పనిచేస్తాయి. నీరు సగానికి తగ్గే వరకు ఈ మూలికలను నీటిలో ఉడకబెట్టండి. ఈ నీటిని కొద్దిగా చల్లారిన తర్వాత వడపోసి శుభ్రం చేసుకోవాలి. ఇది మన నోటి పరిశుభ్రతకు చాలా మంచిది. ఇది మన నోటిని పూర్తిగా శుభ్రపరుస్తుంది.

4. వేప, పటిక.. పూర్వకాలంలో నోరు శుభ్రం చేయడం టూత్ బ్రష్, టూత్ పేస్టు వాడేవారు కాదు. వేప, పటికలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. వాటిని నమలడం వల్ల వాటిలోని యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లు విడుదలవుతాయి. కావాలంటే రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకునే బదులు ఒకసారి బ్రష్ చేసుకోవచ్చు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/నివారణ పద్ధతులను అనుసరించే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Also Read: ఈ ఒక్క ఆకు మధుమేహం, క్యాన్సర్లకి దివ్య ఔషధం.. వీటితో పడుకునే ముందు ఇలా చేస్తే చాలు..?

Cashew: కాల్చిన జీడిపప్పులతో ఆ వ్యాధి కంట్రోల్‌ చేయొచ్చు.. రోగనిరోధక శక్తి పెంచవచ్చు..?