Amla Benefits and Side Effects: ఉసిరికాయ తినడం వలన బెనిఫిట్స్‌తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.. అవేంటంటే..
చిన్నగా కనిపించి ఉసిరికాయలో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరికాయలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఉసిరిలో విటమిన్ సితో పాటు కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, పొటాషియం వంటి అనేక పోషకాలు..

Amla Benefits and Side Effects: చిన్నగా కనిపించి ఉసిరికాయలో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరికాయలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఉసిరిలో విటమిన్ సితో పాటు కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఉసిరికాయను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ ఉసిరిని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే ఉసిరిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
ఉసిరికాయను తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది వైరస్, బ్యాక్టీరియా నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లయితే.. ఉసిరి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఉసిరికాయలో యాంటీవెయిల్ గెయిన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బరువు పెరగడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఉసిరికాయ తినడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. గుండె సంబంధిత వ్యాధుల ప్రమదాన్ని తగ్గిస్తుంది. ఇది డయాబెటిక్ పేషెంట్లకు కూడా మేలు చేస్తంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఉసిరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వలన జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ఆహారంలో ఉసిరిని తీసుకోవడం వలన చర్మం ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఉసిరికాయ తినడం వలన జుట్టుకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరిలోని మూలకాలు జట్టు ఒత్తుగా, దృఢంగా తయారు అవుతుంది. దాంతో పాటు జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
ఉసిరితో ఈ సమస్యలు కూడా..
అయితే, ఉసిరికాయ తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొందరు వ్యక్తులు ఉసిరికాయను తినకడూదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రక్తపోటుతో బాధపడుతున్న రోగులు ఉసిరిని అధికంగా వాడకూడదు. అలాగే, మధుమేహం మందులు తీసుకునే వ్యక్తులు కూడా ఉసిరిని ఎక్కువగా తినకూడదు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నట్లయితే ఉసిరిని ఎక్కువగా తీసుకోవడం మానేయాలి. ఉసిరిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, అసిడిటీ సమస్యలు వస్తాయి.
గమనిక: ఇందులో పేర్కొన్న వివరాలు ఆరోగ్య నిపుణులు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏదైనా సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..