AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Headache: ఉదయం తలనొప్పి వస్తుందా? తేలికగా తీసుకోకండి, ఇది ప్రమాదకరమైన జబ్బు లక్షణం కావొచ్చు..!

Headache: తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్య. అయితే ఇది మెదడు కణితి ముందస్తు హెచ్చరిక కూడా కావచ్చు. ఒక్కోసారి తలనొప్పి రావడం మామూలేనని అనుకుంటాం.

Headache: ఉదయం తలనొప్పి వస్తుందా? తేలికగా తీసుకోకండి, ఇది ప్రమాదకరమైన జబ్బు లక్షణం కావొచ్చు..!
Brain
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 16, 2022 | 7:06 AM

Share

Headache: తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్య. అయితే ఇది మెదడు కణితి ముందస్తు హెచ్చరిక కూడా కావచ్చు. ఒక్కోసారి తలనొప్పి రావడం మామూలేనని అనుకుంటాం. అయితే ఈ సమస్య తరచూ వస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా ఉదయం సమయంలో వాంతితో కూడిన తీవ్రమైన తలనొప్పి ఉంటే అది ప్రమాదకరమైన సంకేతంగా భావించాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇది బ్రెయిన్ ట్యూమర్ వల్ల అయి ఉండొచ్చని చెబుతున్నారు. అందుకే తలనొప్పి క్రమం తప్పకుండా రావడం ప్రారంభిస్తే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లోని న్యూరో, స్పైన్ సర్జరీ చీఫ్ డాక్టర్ ఐ.సి.ప్రేంసాగర్ ప్రకారం.. మెదడు కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభిస్తే అప్పుడు బ్రెయిన్ ట్యూమర్ సమస్య వస్తుంది. దీనిని బ్రెయిన్ నాట్ అని కూడా అంటారు. ఇది ఎందుకు జరుగుతుందనేది ఇప్పటికీ తెలియలేదు. అయితే, కొన్ని అధ్యయనాలలో మాత్రం వివిధ రకాలైన రేడియేషన్ దాని ప్రమాదాన్ని మరింత పెంచుతుందని కనుగొనడం జరిగింది. మెదడు కణితి ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు. వృద్ధులలో దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వృద్ధులలో ఈ కణితి క్యాన్సర్‌గా మారుతుంది. దీని వల్ల వారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కేన్సర్ వస్తే రోగి ఏ దశలో ఉన్నాడో తెలుస్తుంది. వాటి ప్రకారం కీమో, రేడియోథెరపీ లేదా బ్రెయిన్ సర్జరీ చేయాడం జరుగుతుంది. బ్రెయిన్ ట్యూమర్ చికిత్స సాధ్యమే, అయితే లక్షణాలను గుర్తించి సకాలంలో చికిత్స చేయకపోతే ఈ సమస్య చాలా తీవ్రంగా మారుతుందని చెబుతున్నారు వైద్యులు. కణితి మెదడులోని ఏ భాగంలో ఉంది, దాని పరిమాణంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇది రోగి వయస్సు మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పిల్లల్లో కణితులను సులభంగా నయం చేయవచ్చు, పెద్దల్లో కొంచెం కష్టమవుతుంది.

ఇవి లక్షణాలు.. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న వ్యక్తికి దృష్టిలో ఇబ్బంది, నడవడంలో ఇబ్బంది, వినికిడి లేదా దృష్టి బలహీనత, శరీర బలహీనత, తిమ్మిర్లు, వాంతులు, వికారం, మూర్ఛలు వంటి సమస్యలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లలలో దాని లక్షణాలు చిరాకుగా ఉండటం, వారి ప్రవర్తనను మార్చుకోవడం, నడవడానికి ఇబ్బంది పడటం వంటివి ఉంటాయి.. క్యాన్సర్ కణితులను పిల్లల్లో తొలగించడం చాలా సులభం, కానీ పెద్దల్లో కొంచె క్లిష్టతరం అని చెబుతున్నారు వైద్యులు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి.. బ్రెయిన్ ట్యూమర్ బారిన పడకుండా ఉండాలంటే.. సరైని జీవన శైలిని మెయింటేన్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి.

Also read:

Migraine Relief Tips: ఈ ఐదు యోగాసనాలు మైగ్రేన్ మరియు తలనొప్పి నుండి బయటపడటానికి సహాయపడతాయి

Hair Care Tips: జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారా? ఉల్లిపాయ నూనెతో ఇలా చేయండి..

Viral Video: 71 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అంటున్న బామ్మ.. ఏకంగా 11 రకాల వెహికిల్ లైసెన్స్‌లు పొంది..