Cloves: రాత్రి పడుకునే ముందు ఒక్క లవంగం తిన్నారనుకోండి.. ఇక..
లవంగాలు కేవలం సుగంధ ద్రవ్యాలు మాత్రమే కావు, ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాల గని. రాత్రి పడుకునే ముందు లవంగాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తూ, జలుబు, దగ్గు, నోటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఇవి తోడ్పడతాయి.

అత్యంత ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలలో ఒకటైన లవంగాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వైద్య నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ రోజు తెలుసుకుందాం. లవంగాలు ఆహారానికి రుచిని మాత్రమే కాకుండా, వాటిలోని ఔషధ గుణాలతో మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు లవంగాలు తీసుకోవడం లేదా లవంగం నీరు తాగడం వల్ల శరీరంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు లవంగాలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు సూపర్‌గా మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం, ఉబ్బరం వంటి సాధారణ జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అంతేకాకుండా, ఇవి శ్వాసవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో, అలాగే నోటి ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. లవంగాలు ఫైబర్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ కె వంటి ఖనిజాలు, విటమిన్లతో పాటు ఫ్లేవనాయిడ్స్, యూజినాల్ వంటి ముఖ్యమైన కర్బన సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అందుకే ఆయుర్వేద నిపుణులు రాత్రి నిద్రపోయే ముందు లవంగాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. లవంగాలు మెదడును ప్రశాంతపరిచే సహజ పదార్థాలను కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల ఒత్తిడి తగ్గి, మంచి గాఢమైన నిద్రను పొందడానికి సహాయపడుతుంది. లవంగాలలోని ఔషధ గుణాలు శరీరం నుండి విషాన్ని సులభంగా తొలగించడంలో కూడా తోడ్పడతాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారికి లవంగాలు ఉపశమనం కలిగిస్తాయి. వీటిలోని వెచ్చదనం, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతు నొప్పి, దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యల నుండి త్వరగా విముక్తి కలిగిస్తాయని చెబుతారు.
నోటి ఆరోగ్యం విషయానికి వస్తే, లవంగాలు నమలడం వల్ల దుర్వాసన తగ్గుతుంది. ఇది పంటి నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని అందించి, ఆరోగ్యకరమైన నోటిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా లవంగాలు మేలు చేస్తాయి. లవంగం నీరు శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడి, తద్వారా గుండె పనితీరును కూడా తోడ్పడుతుంది. లవంగాల నీటిని తయారుచేయడం చాలా సులభం. ముందుగా ఒక కప్పు నీటిలో మూడు లేదా నాలుగు లవంగాలను కలిపి ఉంచండి. నానబెట్టిన లవంగాలను మీడియం మంట మీద ఐదు నిమిషాలు మరిగించండి. ఆ తర్వాత నీటిని చల్లబరచండి. పడుకునే 30 నిమిషాల ముందు ఈ నీటిని పరిమిత పరిమాణంలో తాగాలి. అయితే లవంగాలు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి కావున, వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. అలాగే, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లవంగాలను ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యులను సంప్రదించడం ఇంకా ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




