AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నొప్పులను లైట్ తీసుకోవద్దు.. మనం చేసే ఈ తప్పులతోనే యూరిక్ యాసిడ్ పెరుగుతుందట..

మన శరీరంలో ఉండే యూరిక్ ఆమ్లం తగ్గిన పెరిగితే.. ఆరోగ్య సమస్యలు తప్పవు. కీళ్ల నొప్పులు, కాళ్లు చేతుల వేళ్లలో వాపు.. కనిపిస్తుంది. మన ఆహారపు అలవాట్లు, రోజువారి లైఫ్ స్టైల్ శరీరంలో యూరిక్ ఆమ్లం పెరుగుదలకు దోహదపడుతుంది. సాధారణంగా మనకు ఈ యూరిక్ ఆమ్లం గురించి అవగాహన చాలా తక్కువ..

నొప్పులను లైట్ తీసుకోవద్దు.. మనం చేసే ఈ తప్పులతోనే యూరిక్ యాసిడ్ పెరుగుతుందట..
Uric Acid
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Dec 16, 2025 | 1:43 PM

Share

మన శరీరంలో ఉండే యూరిక్ ఆమ్లం తగ్గిన పెరిగితే.. ఆరోగ్య సమస్యలు తప్పవు. కీళ్ల నొప్పులు, కాళ్లు చేతుల వేళ్లలో వాపు.. కనిపిస్తుంది. మన ఆహారపు అలవాట్లు, రోజువారి లైఫ్ స్టైల్ శరీరంలో యూరిక్ ఆమ్లం పెరుగుదలకు దోహదపడుతుంది. సాధారణంగా మనకు ఈ యూరిక్ ఆమ్లం గురించి అవగాహన చాలా తక్కువ. పెరిగిన యూరిక్ ఆమ్లం వల్లే కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయని వైద్యులు చెబుతున్నప్పుడు.. ఇలాంటి ఒక ఆమ్లం మన శరీరంలో ఉంది అని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ యూరిక్ ఆమ్లం పెరగడం వల్ల మూత్రపిండాలు పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఈ సమస్య కొన్ని లక్షణాల రూపంలో బయటపడుతూ ఉంటుంది. అవి ఏంటో తెలుసుకుందాం..

ఓళ్ళు నొప్పులు, లైట్ గా జ్వరం, పాదాలు మోకాళ్ళలో నొప్పులు, ఈ లక్షణాలు గమనించినప్పుడు బాడీలో యూరిక్ ఆసిడ్ ఎఫెక్ట్ ఉందని అర్థం చేసుకోవాలి. అయితే కొందరికి పుట్టుకతో ఈ ఎంజైమ్ లోపం ఉంటుంది. ఇలాంటి అరుదైన పరిస్థితి ఉన్న వారిలో యూరిక్ ఆమ్లం మోతాదు పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఆమ్లం పెరుగుదలకు ఇంకా చాలా కారణాలే ఉన్నాయి అవి ఏంటంటే.. కొంతమంది చాలా తక్కువ నీళ్లతో సరిపెట్టుకుంటుంటారు. సరిపడా నీళ్లు తాగని వారిలో డిహైడ్రేషన్ కారణంగా యూరిక్ యాసిడ్ మోతాదు పెరుగుతూ ఉంటుంది. మరికొంతమంది ఎక్కువ మాంసకృతులతో కూడిన ఆహారం తీసుకునే వాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిలో కూడా యూరిక్ యాసిడ్ మోతాదు పెరుగుతుంటుంది.

మధుమేహం ఉన్నవారు, అధిక రక్త ఫోటోతో బాధపడేవారు, మద్యపానం అలవాటు ఉన్నవారు, ఎకోస్ప్రేన్ మందులు వాడుతున్న వాళ్లలో యూరిక్ ఆసిడ్ మోతదు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అలాగే నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉన్న వాళ్లలో కూడా ఈ సమస్య పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కోవలోకి చెందిన వాళ్లందరూ పెరిగిన యూరిక్ యాసిడ్ లక్షణాలైనా ఒళ్ళు నొప్పులు జ్వరం కీళ్లనొప్పులు లక్షణాలు బయట పడినప్పుడు అందుకు మూలకారణాన్ని ఎవరికి వారు గమనించుకుంటే మంచిది అని వైద్యులు చెప్తున్నారు.

ఈ యూరిక్ ఆమ్లం అదుపులోకి వచ్చేవరకు మాంసాహారం మానేయడం మంచిదని, పప్పు ధాన్యాలు, మినప్పప్పు, రెడ్ కిడ్నీ జీన్స్ యూరిక్ ఆమ్లాన్ని పెంచుతాయి.. కాబట్టి వీటి వాడకం తగ్గించి కాలీఫ్లవర్ క్యాబేజీ లాంటివి తీసుకుంటూ ఉండాలి. వీటితోపాటు నట్స్ పాల ఉత్పత్తులు పాలు గుడ్లు తినొచ్చు. ఈ రకమైన ఫుడ్ తింటూ రోజువారి లైఫ్ లో నీళ్లు సరిపడా తాగుతున్నామా లేదా..? మాంసాహార ఎక్కువగా తీసుకుంటున్నామా.. అని ఎవరికి వారు కారణాలు గమనించుకొని జాగ్రత్త పడాలి అని వైద్యులు చెబుతున్నారు.

రక్త పరీక్షతో శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ మోతాదులో తేలికగా గుర్తించవచ్చు. ఆ పెరిగిన మోతాదులను సమం చేయడం కోసం వైద్యులు సూచించే మాత్రలను వాడితే యూరిక్ యాసిడ్ అదుపులోకి వస్తుంది. యూరిక్ యాసిడ్ అదుపులో ఉండకపోతే శరీరంలో ఇన్ఫ్లమెంటరీ రెస్పాన్స్ సృష్టించి అన్ని అర్గాన్ లను ప్రభావితం చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది.

కాబట్టి దీంతో స్వల్ప అవస్తలే కాకుండా తీవ్ర జబ్బులకు దారితీస్తుంది. ఈ యురిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ పెరుగుదలకు మూత్రపిండాల సమస్యలకు సంబంధం ఉంటుంది రక్తంలో కలిసి ఉండే యూరిక్ యాసిడ్ మోతాదు పెరిగితే అది మొదట స్పటికల్లా మారి తర్వాత రాళ్ల రూపం గా మారుతుంది.. ఏ అవయవంలో ఈ యాసిడ్ ఎక్కువగా చేరుకుంటే ఆ అవయవం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఈ యూరిక్ యాసిడ్ పెరుగుదల ప్రభావం గుండె మీద కూడా పడుతుంది.. అలాగే ముద్ర పిండాల పనితీరు కాలేయం పీత్తాశయం పనితీరులు కూడా దెబ్బతిస్తాయి.కీళ్లతో పాటు మరిన్ని వ్యవస్థలు ప్రభావితం అవుతాయి ఈ పెరిగిన యూరిక్ ఆసిడ్ మోతాదు మధుమేహానికి కూడా దారితీస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us