IPL 2026: రూ. 28 కోట్లతో ఇద్దరు యువ ఆటగాళ్ల ఎంట్రీ.. యంగ్ ఆర్మీతో పవర్ ఫుల్‌గా చెన్నై టీం..
CSK Squad After IPL 2026 Auction: మొత్తానికి, రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో, ధోని మార్గనిర్దేశకత్వంలో యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కలయికతో CSK 2026 సీజన్‌కు సిద్ధమైంది. అన్-క్యాప్డ్ ఆటగాళ్లపై పెట్టిన భారీ పెట్టుబడి మైదానంలో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

CSK Squad After IPL 2026 Auction: అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకుంది. స్టార్ ఆటగాళ్ల కోసం పోటీ పడకుండా, దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న యువ కెరటాలపై కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఇద్దరు అన్-క్యాప్డ్ (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని) ఆటగాళ్ల కోసం రికార్డు స్థాయి ధర వెచ్చించి చరిత్ర సృష్టించింది.
ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన CSK, ఈసారి వేలంలో యువ రక్తాన్ని నింపడంపైనే ప్రధానంగా దృష్టి సారించింది.
ప్రశాంత్ వీర్ (రూ. 14.20 కోట్లు): ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఎడమచేతి వాటం స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం చెన్నై ఏకంగా రూ. 14.20 కోట్లు వెచ్చించింది. రూ. 30 లక్షల కనీస ధరతో వచ్చిన ఇతని కోసం పలు జట్లు పోటీ పడగా, చివరకు CSK దక్కించుకుంది.
కార్తీక్ శర్మ (రూ. 14.20 కోట్లు): రాజస్థాన్‌కు చెందిన పవర్ హిట్టర్ కార్తీక్ శర్మను కూడా అదే ధరకు (రూ. 14.20 కోట్లు) కొనుగోలు చేసి అందరినీ విస్మయానికి గురిచేసింది. దేశవాళీ టోర్నీల్లో వీరిద్దరూ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో ఫ్రాంచైజీ వీరిపై భారీ నమ్మకం ఉంచింది.
అకీల్ హొసీన్ (రూ. 2 కోట్లు): వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హొసీన్‌ను అతని కనీస ధరకే CSK సొంతం చేసుకుంది.
కీలక మార్పులు – ట్రేడింగ్స్: వేలానికి ముందే CSK కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది.
సంజు శాంసన్ ఎంట్రీ: రాజస్థాన్ రాయల్స్ నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తీసుకుంది.
జడేజా అవుట్: జట్టులో ఎంతో కీలకమైన రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌లను రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసింది.
విడుదల: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మతీషా పతిరానా వంటి విదేశీ స్టార్లను జట్టు నుంచి విడుదల చేసింది.
కెప్టెన్సీ & ధోని: రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా కొనసాగనుండగా, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా జట్టులో మరోసారి కనిపించనున్నాడు. ఇది ధోనికి చివరి సీజన్ కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
CSK IPL 2026 పూర్తి జట్టు:
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు : అకేల్ హోసేన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, మాథ్యూ షార్ట్.
CSK మిగిలిన పర్స్: రూ. 11.50 కోట్లు
మిగిలిన ప్లేయర్ స్లాట్లు: 5
మిగిలిన ఓవర్సీస్ ప్లేయర్ స్లాట్లు: 2
CSK నిలుపుకున్న ఆటగాళ్ల జాబితా: రుతురాజ్ గైక్వాడ్ (c), ఆయుష్ మ్హత్రే, MS ధోని, సంజు శాంసన్ (రాజస్థాన్ రాయల్స్ నుండి ట్రేడ్ చేయబడింది), డెవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్, శివమ్ దూబే, జామీ ఓవర్‌టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్‌కీత్, జిమ్‌పాల్‌కీత్, జి. చౌదరి, నాథన్ ఎల్లిస్.
మొత్తానికి, రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో, ధోని మార్గనిర్దేశకత్వంలో యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కలయికతో CSK 2026 సీజన్‌కు సిద్ధమైంది. అన్-క్యాప్డ్ ఆటగాళ్లపై పెట్టిన భారీ పెట్టుబడి మైదానంలో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.
గమనిక: వేలం పూర్తి కానందున, ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు పూర్తి స్వ్కాడ్‌లో మార్పులు ఉండవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
