AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు ‘ఐడియా’ యాడ్‌తో ఫేమస్.. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

సాధారణంగా హీరోయిన్లు ఇండస్ట్రీలోకి రాక ముందు మోడల్ గా పని చేసి ఉంటారు. వివిధ బ్రాండెడ్ ఉత్పత్తులకు ప్రమోటర్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న ఈ ముద్దుగుమ్మ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

Tollywood: ఒకప్పుడు 'ఐడియా' యాడ్‌తో ఫేమస్.. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Krithi Shetty
Basha Shek
|

Updated on: Dec 16, 2025 | 7:14 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. తన అందం, అభినయంతో దక్షిణాదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన ఈ చిన్నది ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. స్టార్ హీరోల సినిమాల్లో బాల నటిగా మెప్పించింది. అయితే ఉన్నత చదువుల కోసం ఇండస్ట్రీకి దూరమైంది. అయితే మెడిసిన్ కూడా చదివే క్రమంలోనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. పలు అందాల పోటీల్లోనూ పాల్గొంది. ఇదే క్రమంలో బ్రాండెడ్ ఉత్పత్తులకు ప్రమోటర్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. ఐడియా, లైఫ్ బాయ్, స్లీప్ కంపెనీ, పార్లే, బ్లూ స్టార్ వంటి ప్రముక ఉత్పత్తులవాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 17 ఏళ్ల వయసులోనే వెండితెర అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే వంద కోట్ల హిట్ కొట్టింది. ఆ తర్వాత కూడా పలువరు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. నాని, నాగ చైతన్య, రామ్ పోతినేని, శర్వానంద్ తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కమర్షియల్ సక్సెస్ లు అందుకోలేకపోతోంది. అయినా ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ ఐడియా బ్యూటీ మరెవరో కాదు ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి.

గతేడాది శర్వానంద్ నటించిన మనమే సినిమాలో చివరిగా కనిపించింది కృతి శెట్టి. ప్రస్తుతం హీరో కార్తీ నటించిన అన్నగారు వస్తున్నారు మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. గతంలో కార్తీ హీరోగా నటించిన నాన్ మహన్ అల్ల (తెలుగులో నా పేరు శివ) సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది కృతి. 2010లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే కార్తీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందీ అందాల తార. దీంతో పాటు ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కుతోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీలో కథానాయికగా నటిస్తోంది కృతి శెట్టి. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

కృతి శెట్టి లేటెస్ట్ ఫొటోస్.,.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .