AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొద్దున్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

వంటల్లో వెల్లుల్లి చాలా ముఖ్యమైనది. ఇది లేని వంట దాదాపు ఉండదు. వెల్లుల్లి వంటకు మంచి రుచి, వాసన ఇస్తుంది. అంతేకాదు దీనితో చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి. పాతకాలం ఆయుర్వేద వైద్యంలో వెల్లుల్లిని బాగా వాడేవారు. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగితే శరీరానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

పొద్దున్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
Garlic Health Benefits
Prashanthi V
|

Updated on: Jun 15, 2025 | 11:35 PM

Share

వెల్లుల్లి నీటిలో అలిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరాన్ని కాపాడే శక్తిని పెంచుతుంది. వైరస్‌ లు, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వాటితో పోరాడే శక్తిని ఇస్తుంది. రోజూ తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. వెల్లుల్లి నీరు రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇది పేగుల్లోని వ్యర్థాలను తొలగిస్తుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. శరీరం పనులు చురుగ్గా సాగేందుకు ఇది సహాయపడుతుంది.

వెల్లుల్లి నీరు శరీరంలోని మెటబాలిజాన్ని వేగంగా పనిచేయిస్తుంది. దీని వల్ల శరీర కొవ్వు త్వరగా కరుగుతుంది. ఆకలిని కూడా ఇది తగ్గిస్తుంది. దీంతో ఎక్కువ తినడం ఆగిపోతుంది. బరువు తగ్గడానికి సాయం చేస్తుంది.

వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. ఇది చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. ముడతలు, వృద్ధాప్య ఛాయలు తక్కువగా కనిపించేలా చేస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తుంది.

ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలను నలిపి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇలా కొన్నాళ్ళు చేస్తే మీ శరీరంలో మంచి మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
ఆ ఊర్లోని పిల్లలంతా సర్కార్ బడికే..
ఆ ఊర్లోని పిల్లలంతా సర్కార్ బడికే..
వేసవిలో విపరీతంగా జుట్టు రాలుతోందా? ఈ 6 చిట్కాలతో చెక్ పెట్టండి..
వేసవిలో విపరీతంగా జుట్టు రాలుతోందా? ఈ 6 చిట్కాలతో చెక్ పెట్టండి..
చెత్తబుట్టలో పారేసే ఆ తొక్కల్లోనే అసలైన రహస్యం.. ఈ నిజం తెలిస్తే
చెత్తబుట్టలో పారేసే ఆ తొక్కల్లోనే అసలైన రహస్యం.. ఈ నిజం తెలిస్తే
మీరు రోజుకు కేవలం రూ.33 ఆదా చేస్తే చాలు చేతికి రూ.19 లక్షలు..!
మీరు రోజుకు కేవలం రూ.33 ఆదా చేస్తే చాలు చేతికి రూ.19 లక్షలు..!
నా భర్త తెలుగువారే: సుమంగళి
నా భర్త తెలుగువారే: సుమంగళి
పాత దేవుడి పటాలు, విగ్రహాలు ఇక చెత్తలో కాదు.. జీహెచ్‌ఎంసీ కొత్త..
పాత దేవుడి పటాలు, విగ్రహాలు ఇక చెత్తలో కాదు.. జీహెచ్‌ఎంసీ కొత్త..
జాన్వీ పాత్ర పై కామెంట్స్.. పెద్ది సినిమా నుంచి ఆ సీన్స్ తొలగింపు
జాన్వీ పాత్ర పై కామెంట్స్.. పెద్ది సినిమా నుంచి ఆ సీన్స్ తొలగింపు
ఇల్లు తుడిచే నీటిలో ఈ పదార్థాలను కలపండి! ఏసీలా చల్లగా, అద్దంలాంటి
ఇల్లు తుడిచే నీటిలో ఈ పదార్థాలను కలపండి! ఏసీలా చల్లగా, అద్దంలాంటి
ధోనీ సరసన రిషభ్ పంత్.. 'హాఫ్ సెంచరీ'తో అరుదైన మైలురాయి..!
ధోనీ సరసన రిషభ్ పంత్.. 'హాఫ్ సెంచరీ'తో అరుదైన మైలురాయి..!
తెలంగాణలో విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవుల పొడిగింపు..!
తెలంగాణలో విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవుల పొడిగింపు..!