మీరు రోజూ మందు కొడతారా! అయితే కాకరకాయను తినాల్సిందే.. లేదంటే ఏం జరుగుతుందో తెలిస్తే భరించలేరు..

Health Benefits of Bitter Gourd : కాకరకాయ గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. దీనికి చాలా ప్రత్యేక గుణాలు ఉన్నాయి. కొంతమంది చేదుగా ఉంటుందని

మీరు రోజూ మందు కొడతారా! అయితే కాకరకాయను తినాల్సిందే.. లేదంటే ఏం జరుగుతుందో తెలిస్తే భరించలేరు..
Follow us
uppula Raju

|

Updated on: Feb 26, 2021 | 5:42 AM

Health Benefits of Bitter Gourd : కాకరకాయ గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. దీనికి చాలా ప్రత్యేక గుణాలు ఉన్నాయి. కొంతమంది చేదుగా ఉంటుందని దీనిని తినడానికి ఇష్టపడరు అలాంటి వారు అసలు నిజాలు తెలుసుకోవాలి. కాకరకాయ అనాధిగా మన పూర్వీకుల నుంచి వస్తున్న దివ్య ఔషధం. దీనిని హిందీలో కరేలా అని ఇంగ్లీష్‌లో బిట్టర్ స్క్వాష్ అని పిలుస్తారు. ఇది చేదుగా ఉన్నప్పటికీ, అనేక ప్రయోజనాలు కలిగిన ఆక్సీకరణలు, ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉంటుంది. A,B,C విటమిన్లు, బీటా-కేరొటీన్ వంటి ఫ్లవోనాయిడ్స్, కెరోటిన్, లుటీన్, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీసు, మెగ్నీషియం వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. దీనిని ఏఏ వ్యాధులకు ఎలా పనిచేస్తుందో దీనిని తినడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటగా చెప్పుకోవాలంటే మందుబాబుల గురించే చెప్పాలి. ఎందుకంటే కాకరకాయ వారికి సంజీవనిలా పనిచేస్తుంది. నిత్యం మందు తాగే అలవాటు ఉన్నవారు రోజు ఒక గ్లాసు కాకరకాయ జ్యూస్‌ని తాగాలి. దీంతో మీ లివర్‌లో ఉన్న చెత్త మొత్తం తొలగిపోతుంది. చెడు కొలస్ట్రాల్ మొత్తం తగ్గిస్తోంది. మీ లివర్‌పై ఉన్న భారాన్ని తగ్గించి ఆక్టివ్‌గా పనిచేయడానికి దోహదం చేస్తుంది. ఒక వారం రోజులు ఇలా చేసి చూస్తే మీకే అర్థమై పోతుంది. కాకర జ్యూస్ లివర్‌కు టానిక్‌లా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

శ్వాస రుగ్మతలు తగ్గించుకోవచ్చు. తాజా కాయలు తినడం వల్ల ఆస్తమా, జలుబు, దగ్గు మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. నీటిలో బిట్టర్ మెలోన్ ఆకులు లేదా పండ్లను ఉడికి౦చండి, దీనిని రోజూ తీసుకుంటే అంటురోగాలు రానీకుండా చేస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తి పెంపొందడానికి కూడా సహాయపడుతుంది. బిట్టర్ మెలోన్ మొటిమలు, మచ్చలు, చర్మ అంటువ్యాధులను తొలగించుకోవడానికి మిక్కిలి ఉపయోగపడుతుంది. నిమ్మరసంతో కూడిన బిట్టర్ మెలోన్ ని ప్రతిరోజూ పరగడుపున 6 నెలలు తీసుకుంటే, సరైన ఫలితాలు పొందుతారు.

ఇక బిట్టర్ మెలోన్ రసం 2 వ రకం మధుమేహవ్యాధిని అధిగమించడానికి అత్యంత సాధారణ నివారణ మార్గంగా చెప్పవచ్చు. బిట్టర్ మెలోన్ బ్లడ్ షుగర్ తగ్గించడానికి సహాయపడే ఇన్సులిన్ వంటి కొన్ని రసాయనాలను కలిగి ఉంటుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు కాకర దివ్య ఔషధంలా పనిచేస్తుందని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. బిట్టర్ మెలోన్ లో పీచు లక్షణాలు అధికంగా కలిగిఉండడం వల్ల తేలికగా అరుగుతుంది. ఈ ఆహారం అరుగుదలకు, మలబద్ధకం, అజీర్తి సమస్యల నివారణలో సహాయపడి శరీరం నుండి చెత్తను తొలగిస్తుంది. బిట్టర్ మెలోన్ కాలేయం, మూత్రాశయం ఆరోగ్యంగా ఉచుకోవడానికి సహాయపడుతుంది. ఇది మూత్రపిండాలలో రాళ్ళు నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది.

బిట్టర్ మెలోన్ అనేక మార్గాలలో గుండెకు చాలా మంచిది. ఇది ధమని గోడలను ఆటంకపరిచే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది, దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బ్లడ్ షుగర్ స్థాయి తక్కువగా ఉండడం వల్ల కూడా గుండెను ఆరోగ్య౦గా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. బిట్టర్ మెలోన్ కాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. బిట్టర్ మెలోన్ మీ వ్యవస్థ తాజాగా ఉండడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లను కలిగిఉంది. ఇది మీ జీవక్రియను, అరుగుదల విధానాన్ని అభివృద్ది చేసి తద్వారా త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

విశాఖ రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.. అసలు నిందితుడు ఎవరో కాదు..

న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక నిజాలు.. రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడు బిట్టు శ్రీను ఏం చెప్పాడో తెలిస్తే షాక్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!