Red Banana Benefits: ఎర్ర అరటి పండు రోజుకొకటి తింటే చాలు.. ఆస్పత్రికి వెళ్లాల్సిన పనే ఉండదు..!
Red Banana Benefits: మంచి ఆహారం తీసుకుంటే.. మంచి ఆరోగ్యం మనసొంతం అవుతుంది. ఆ కారణంగానే చాలా మంది ఆహారం విషయంలో..
Red Banana Benefits: మంచి ఆహారం తీసుకుంటే.. మంచి ఆరోగ్యం మనసొంతం అవుతుంది. ఆ కారణంగానే చాలా మంది ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. భోజనంతో పాటు.. ప్రత్యేకంగా ఫలాలను కూడా తింటారు. అయితే, ఇవాళ మనం అరటి పండు ప్రత్యేక ఎంటో తెలుసుకుందా. అరటి పండు అంటే ఇది మామూలు అరటిపండు కాదు. సాధారణంగా మనం కూర వండుకునే అరటిపండు చూసి ఉంటాం.. పండిన అరటి పండును తిని ఉంటాం. కానీ ఎర్రటి అరటి పండును ఎప్పుడైనా చూశారా? మన దేశంలో అరుదు కానీ.. ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో ఈ అరటి పండుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అవును ఎర్రటి అరటి పండు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. మనిషిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ అరటి పండు దోహపడుతుందని తేల్చారు. మరి ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్ర అరటి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా రక్షిస్తుంది.. సాధారణంగా, ప్రజలు అరటి పండ్లను ఎక్కువగా తింటారు. కారణం.. అరటి పండ్లలో పోషకాలు చాలా ఎక్కువ. అయితే, ఎర్రటి అరటి పండులో అంతకు మించి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయట. అంతేకాదు.. సాధారణ అరటిపండులో కంటే చాలా ఎక్కువ బీటా కెరోటిన్ కలిగి ఉంటుందట. బీటా కెరోటిన్ గుండె ధమనులలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్, గుండె జబ్బులను దరిచేరనీయదు.. ఎరుపు రంగు అరటి పండు తినడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఈ అరటిపండు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాదు.. ఈ అరటి పండు తినడం వల్ల చెస్ట్ అలర్జీని తగ్గిస్తుంది.
బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. ఎర్ర అరటిపండ్లలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి, ఇవి మీ బరువు తగ్గడానికి సహాయపడుతాయి. అరటిపండు తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దాంతో అతిగా తినడం మానేస్తాం. అంతిమంగా ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
తక్షణ శక్తినిస్తుంది.. ఎర్ర అరటి పండు సాధారణ అరటి పండు కన్నా ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఎర్ర అరటిపండ్లు తీసుకోవడం తక్షణ శక్తి లభిస్తుంది. ఈ అరటిలో ఉన్న సహజ చక్కెర వెంటనే శక్తిని ఇవ్వడానికి దోహదపడుతుంది.
రక్తహీనతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. ఎరుపు రంగు అరటిపండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది కాకుండా, విటమిన్ బి 6 కూడా ఈ పండు తినడం ద్వారా శరీరానికి లభిస్తుంది. రక్తహీనత లోపాన్ని అధిగమించడానికి విటమిన్ బి 6 సహాయపడుతుంది.
రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.. ఎర్ర అరటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక ఎర్ర అరటిపండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆ కారణంగా.. గుండె పోటు రాకుండా కాపాడుతుంది.
Also read:
చెక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఫస్ట్ షో నుంచే మంచి టాక్.. ప్రేక్షకులు ఏమన్నారంటే.!
దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ పతనం… ఆరంభంలోనే సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల నష్టం