న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక నిజాలు.. రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడు బిట్టు శ్రీను ఏం చెప్పాడో తెలిస్తే షాక్..

Advocates Murder case : తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా

న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక నిజాలు.. రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడు బిట్టు శ్రీను ఏం చెప్పాడో తెలిస్తే షాక్..
Follow us
uppula Raju

|

Updated on: Feb 25, 2021 | 11:31 PM

Advocates Murder case : తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా నిందితుడు బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను వెల్లడించాడు. వామన్‌రావు హత్యకు నాలుగు నెలల క్రితమే ప్లాన్‌ చేసినట్లు అతడు వెల్లడించాడు. అడ్వకేట్‌ వామన్‌రావు బతికి ఉంటే తమకు ఎన్నటికైనా సమస్యేనని భావించిన కుంట శీను, తాను హత్యకు పథకం రచించినట్లు పేర్కొన్నాడు. కాగా బిట్టు శ్రీనుకు సంబంధించిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టుపై వామన్‌రావు గతంలో అనేక కేసులు వేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం తమ స్వగ్రామం గుంజపడుగులోనే పాత స్కూల్ బిల్డింగ్ నుంచి రెక్కీ నిర్వహించిన శ్రీను గ్యాంగ్.. ఆయనను హత్య చేసేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడ జనసమ్మర్ధం ఎక్కువగా ఉండటంతో వారి పన్నాగం విఫలమైంది.

దీంతో ఈనెల 17వ తేదీన పక్కాగా ప్లాన్‌ చేసిన దుండగులు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులు దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. కారులో హైదరాబాద్‌ వస్తుండగా మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై పట్టపగలే నరికి చంపేశారు. వామన్‌రావు ఒంటరిగా దొరకడంతో ఆయనతో పాటు భార్యను కూడా హతమార్చారు. వారిద్దరు చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత కుంట శీను, బిట్టు శ్రీనుకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో అతడిని మహారాష్ట్రకు పారిపొమ్మని బిట్టు శ్రీను సలహా ఇచ్చాడు. తాను మాత్రం రెండు రోజులు ఇంట్లోనే మకాం వేశాడు. అంతేగాక హత్యకు ముందు వేరే సిమ్ కొనుగోలు చేసిన బిట్టు శ్రీను వాటి ద్వారానే తన భాగస్వాములతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ పెద్దపల్లి జంట హత్యల కేసును త్వరిగతిన ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. బిట్టు శ్రీనును అతడి ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ కేసులో పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసిందని చెప్పాలి. నిందితులను అందరిని పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తిస్థాయి విచారణ చేసి వాంగ్మూలంలోని అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించారు. దీనికిగాను హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు మరియు సైబర్ క్రైమ్ పరిశోధకులను విచారణ సహాయకులుగా తీసుకొని కేసును ఛేధించారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్ గారు ప్రధాన విచారణ అధికారిగా సమగ్ర విచారణ చేశారు. కేసుకు సంబంధించి ప్రతి ఒక్క సాక్ష్యాన్ని పరిశీలించి పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు.

విశాఖ రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.. అసలు నిందితుడు ఎవరో కాదు..

Crime in UP: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. జామ పళ్లు తెంపొద్దన్నకు అందరూ కలిసి వ్యక్తి ప్రాణాలు తీశారు..!