నిండు ప్రాణాన్ని కాపాడిన హైదరాబాద్ పోలీసులు.. సకాలంలో స్పందించడంతో తప్పిన ప్రాణాపాయం.. అసలు వివరాలు ఇలా..

Hyderabad Police : లా అండ్‌ ఆర్డర్‌ అంటే నేరాలు-ఘోరాలు, కేసుల విచారణలే కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో కొత్త ఒరవడి సృష్టిస్తున్న హైదరాబాద్‌ పోలీసులు..

నిండు ప్రాణాన్ని కాపాడిన హైదరాబాద్ పోలీసులు.. సకాలంలో స్పందించడంతో తప్పిన ప్రాణాపాయం.. అసలు వివరాలు ఇలా..
uppula Raju

|

Feb 26, 2021 | 12:14 AM

Hyderabad Police : లా అండ్‌ ఆర్డర్‌ అంటే నేరాలు-ఘోరాలు, కేసుల విచారణలే కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో కొత్త ఒరవడి సృష్టిస్తున్న హైదరాబాద్‌ పోలీసులు.. అంతా అయిపోయాక స్పాట్‌కు రావడం కాదు..జరగకుండా ముందే అలర్ట్‌ అవుతున్నారు. పోలీసింగ్‌కి కొత్త భాష్యం చెబుతున్నారు. డయల్‌ హండ్రెడ్‌కి కాల్‌రాగానే నిమిషాల్లో స్పాట్‌కు చేరుకుంటున్నారు. హైదరాబాద్‌ పోలీసుల చొరవ ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. మల్కాజ్‌గిరి పోలీసులు వెంటనే స్పందించటంతో..మెడకు బిగుసుకున్న ఉరిముడి చివరిక్షణాల్లో విడిపోయింది. చావుబతుకుల మధ్య కొన్ని క్షణాలే తేడా. పోలీసులు ఐదారు క్షణాలు ఆలస్యమై ఉన్నా వ్యక్తి ప్రాణం పోయి ఉండేదే. అప్పటికే మెడకు బిగుసుకున్న ఉరితాడుని చాకచక్యంగా తప్పించి…ఓ ప్రాణాన్ని నిలబెట్టారు పోలీసులు.

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంత సరస్వతినగర్‌లో జరిగిందీ మిరాకిల్‌. ఇంటి గొడవలతో విసిగిపోయిన సాయిలు అనే యాభై సంవత్సరాల వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇంట్లోని బాత్రూంలో ఉరేసుకున్నాడు. తలుపులు బిగించుకోవటంతో..కుటుంబసభ్యులు ఆయన్ని ఏదోలా కాపాడే ప్రయత్నం చేస్తూనే డయల్‌ హండ్రెడ్‌కి ఫోన్‌ చేశారు. దీంతో నాలుగు నిమిషాల్లో…నాలుగంటే నాలుగే నిమిషాల్లో ఆ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. అప్పటికే ఉరితాడుకు గిలగిలా కొట్టుకుంటున్న సాయిలుని కాపాడారు. మెడకు తాడు తప్పించి అతని ఊపిరి నిలబెట్టారు. వెంటనే బాధితుడిని మల్కాజిగిరి ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించటంతో ప్రాణాపాయం తప్పింది. సకాలంలో చేరుకుని ఓ ప్రాణాన్ని నిలబెట్టిన పోలీసులకు బాధితుడి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. పోలీసుల చొరవని స్థానికులు ప్రశంసించారు.

ఇటీవల కాలంలో హైదరాబాద్ పోలసులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. కేసులను తక్కువ సమయంలోనే ఛేదిస్తున్నారు. దీంతో నగరంలో క్రైమ్ రేట్ కంట్రోల్‌లో ఉంది. లా అండ్ ఆర్డర్ పరిరక్షణను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలపై వీడియోలు, పాటల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియాను వాడుకొని అందరికి తెలియజేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ అందరికి అందుబాటులో ఉంటున్నారు. నేరాలకు పాల్పడే వారికి సింహస్వప్నంగా నిలుస్తున్నారు. మఖ్యంగా డయల్ హండ్రెడ్ రెస్పాన్సిబిలిటిగా ముందుకు సాగుతోంది. తక్షణమే స్పందిస్తూ ప్రమాదాలను నివారిస్తోంది.

ఇదిలా ఉంటే ఇటీవల జనాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిపై కూడా హైదరాబాద్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, సిగ్నల్స్‌ వద్ద ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఆదేశాల మేరకు వాహనదారులను ఆపి వినూత్న పద్ధతిలో అవగాహన కల్పిస్తున్నారు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, ప్రదర్శన రూపంలో చూపించారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇలా హైదరాబాద్ పోలీసులు నగరవాసులను కంటికిరెప్పలా కాపాడుతూ.. సేవలను అందిస్తున్నారు.

న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక నిజాలు.. రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడు బిట్టు శ్రీను ఏం చెప్పాడో తెలిస్తే షాక్..

విశాఖ రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.. అసలు నిందితుడు ఎవరో కాదు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu