Eye Stroke : హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ గురించి వినే ఉంటారు..మరి ఐ స్ట్రోక్ గురించి విన్నారా..అయితే తెలుసుకోండి..

కొన్ని కారణాల వల్ల రెటీనా ఆర్టరీలో బ్లాక్స్ అడ్డుపడటం వలన రెటీనాకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం సరఫరా నిలిచిపోతుంది.

Eye Stroke : హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ గురించి వినే ఉంటారు..మరి ఐ స్ట్రోక్ గురించి విన్నారా..అయితే తెలుసుకోండి..
Eye Stroke
Follow us
Madhavi

| Edited By: Ravi Kiran

Updated on: Mar 23, 2023 | 9:32 AM

కొన్ని కారణాల వల్ల రెటీనా ఆర్టరీలో బ్లాక్స్ అడ్డుపడటం వలన రెటీనాకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం సరఫరా నిలిచిపోతుంది. ఈ సమస్యను ఐ స్ట్రోక్ అని కూడా అంటారు. చిన్న పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడతారు. దీని వల్ల తీవ్రమైన దృష్టి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

కంటిని ప్రభావితం చేసే స్ట్రోక్‌ను రెటీనా స్ట్రోక్ అని అని కూడా పిలుస్తారు. ఇది రోగి కంటి రెటీనా రక్త నాళాలను అడ్డుకుంటుంది. రెటీనా అనేది కంటి వెనుక భాగంలో కాంతి-సెన్సిటివ్ కణజాలం. రక్తనాళంలో గడ్డ కట్టడం వల్ల, రక్తనాళం సంకుచితం కావడం వల్ల కానీ, లేదా రక్తనాళంలో కొలెస్ట్రాల్ చేరడం వల్ల ఈ అడ్డంకి ఏర్పడుతుంది. కళ్లను ప్రభావితం చేసే ఈ స్ట్రోక్ లో అత్యంత సాధారణ లక్షణం అకస్మాత్తుగా రావడం. నొప్పి లేకుండా దృష్టిని కోల్పోవడం దీని ప్రధాన సమస్య. కంటిలోని రక్తనాళాల బ్లాక్ సమస్య లేదా కంటి స్ట్రోక్ అనేది ప్రతీ 50,000 మందిలో ఒకరికి తలెత్తుతుంది.

కొందరిలో చిన్నతనం నుంచే ఈ సమస్య ఏర్పడుతుంది. ఒకప్పుడు కేవలం వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు చిన్నవారిలోనూ కనిపిస్తోంది. ఈ రకమైన సమస్య చిన్న పిల్లలలో చాలా అరుదుగా కనిపిస్తుంది. రెటీనా బ్లాక్ సమస్య సాధారణంగా 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో మాత్రమే కనిపిస్తుంది. వయస్సుతో పాటు, మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలు , కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల కంటి స్ట్రోక్ కలిగే అవకాశం ఉంటుంది. అయితే చిన్నపిల్లల కళ్లలోని కీలక రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం కూడా కొన్ని అరుదైన కేసుల్లో చూస్తున్నాం.

ఇవి కూడా చదవండి

రోగి కంటిలో రక్తనాళాలు బ్లాక్ అయ్యాయో లేదో తనిఖీ చేసేందుకు ఫ్లోరోసెసిన్ యాంజియోగ్రఫీని నిర్వహిస్తారు. ఇది కాకుండా, అతని రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి, RBS స్థాయిని కూడా పరిశీలిస్తారు. కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్నవారిలో కంటి స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.

దీనికి చికిత్స చాలా సరళమైనది, డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, కంటి స్ట్రోక్‌కు చికిత్స అనేది ఆ స్ట్రోక్ వల్ల ఎంత నష్టం జరిగిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సాధ్యమయ్యే చికిత్సలు:

-కంటి ప్రాంతాన్ని మసాజ్ చేయడం.

– బ్లడ్ థిన్నర్ మందులు.

– యాంటీ-వాస్కులర్ ఎండోథెలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ డ్రగ్స్.

-లేజర్ చికిత్స.

-అధిక పీడనం కలిగిన కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ మిశ్రమం.

కంటి స్ట్రోక్‌ రాకుండా ఎలాంటి జాగ్రత్తల పాటించాలి:

1-ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అందులో తగినంత మొత్తంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి.

2. రక్తంలో చక్కెరలో హెచ్చుతగ్గులను పర్యవేక్షించాలి.

3- ధూమపానం చేయవద్దు.

4. అతిగా మద్యం సేవించడం మానుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..