Baby Milk Bottles Clean: ఈ ఈజీ టిప్స్ ని పాటించి.. మీ పిల్లల పాల బాటిల్స్ ను ఇలా క్లీన్ చేయండి!!
తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటారు. ప్రతీ చిన్న విషయంలో కూడా చాలా కేరింగ్ గా ఉంటారు. బట్టల విషయంలో, తిండి విషయంలో, ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వారు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటారు. అలాగే పాల బాటిళ్లు క్లీన్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే వారు తొందరగా జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాల బాటిళ్లపై ఫాస్ట్ గా బ్యాక్టీరియా..

తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటారు. ప్రతీ చిన్న విషయంలో కూడా చాలా కేరింగ్ గా ఉంటారు. బట్టల విషయంలో, తిండి విషయంలో, ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వారు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటారు. అలాగే పాల బాటిళ్లు క్లీన్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే వారు తొందరగా జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాల బాటిళ్లపై ఫాస్ట్ గా బ్యాక్టీరియా చేరుతుంది. కొత్తగా తల్లులు అయిన వాళ్లు వీలైనంత వరకూ తల్లి పాలనే ఇస్తారు. అయితే కొంతమందికి పాలు ఉండవు. అలాంటి వాళ్లు ఫీడింగ్ బాటిళ్లను ఉపయోగిస్తారు. చాలా మంది వీటిని పైపైనే శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. కొన్ని ప్రత్యేకమైన పద్దతులు ఉపయోగించి బాటిళ్లను క్లీన్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.
ప్రిపరేషన్:
బేబీ పాల బాటిళ్లను క్లీన్ చేసే ముందు మీరు మీ చేతులను సబ్బు పెట్టి క్లీన్ చేసుకోవడం ముఖ్యం.
రెండు, మూడు బాళ్లను వాడాలి:
మీరు పాపాయికి బాటిల్ తో పాలను ఇస్తూ ఉంటే ఒక బాటిలే కాకుండా.. రెండు, మూడు బాటిల్స్ ను ఉపయోగించాలి. దీని వల్ల పిల్లలకు విరేచనాలు, కడుపులో నొప్పి వంటి అనారోగ్య సమస్యలు రావు.
వెంటనే క్లీన్ చేయాలి:
పిల్లలు తాగిన పాల బాటిల్స్ ను అన్నీ ఒకసారే కడుగుదామని పక్కన పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల పాలపై తొందరగా పాలు, క్రిములు, బ్యాక్టీరియా చేరే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
బాటిల్స్ లోని భాగాలను విడదీసి కడగాలి:
బాటిల్స్ ను అలానే ఉంచి శుభ్రం చేయకుండా.. బాటిల్స్ లోని భాగాలను విడదీసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కడా క్రిములు అనే ఉండకుండా ఉంటాయి. బాటిల్స్ కూడా నీటిగా క్లీన్ అవుతాయి.
బాటిల్ బ్రష్ ను ఉపయోగించాలి:
పాల డబ్బాలను క్లీన్ చేసుముందు బ్రష్ ఉపయోగిస్తే.. లోపలి భాగాలు కూడా ఈజీగా క్లీన్ అవుతాయి.
వేడి నీటిని యూజ్ చేయాలి:
పాల బాటిల్స్ ను క్లీన్ చేయడానికి వేడి నీటిని ఉపయోగించాలి. వేడి నీటితో శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు ఏమైనా ఉంటే నశిస్తాయి.
స్టెరిలైజ్ చేయాలి:
పాలు అనేవి జిగురుగా ఉంటాయి. అందులోనూ బాటిల్స్ లో వేసి ఎక్కువ సేపు ఉంచుతాం. ఆ జిగురు అంత తొందరగా పోవు.. కాబట్టి బాటిల్స్ లోపల కూడా బ్రష్ తో శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత.. బాటిల్స్ పార్ట్స్ అన్నీ విడదీయాలి. ఆ తర్వాత వీటిని వేడి నీటిలో ఓ పది నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడంతో బాటిల్ లోని క్రిములు, బ్యాక్టీరియా తొలగిపోతాయి. పిల్లలకు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.




