Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Health: చలికాలంలో గుండెపోటు ముప్పు అధికం.. నిర్లక్ష్యం చేయకండి.. నిపుణులు ఏమంటున్నారంటే..

శీతాకాలంలో అనేక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. శ్వాసకోశ వ్యాధులు, ఆర్థరైటిస్, ఆస్తమా వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని...

Winter Health: చలికాలంలో గుండెపోటు ముప్పు అధికం.. నిర్లక్ష్యం చేయకండి.. నిపుణులు ఏమంటున్నారంటే..
Heart Attack
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 18, 2023 | 6:45 AM

శీతాకాలంలో అనేక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. శ్వాసకోశ వ్యాధులు, ఆర్థరైటిస్, ఆస్తమా వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు . గుండె ధమనుల సంకుచితం కారణంగా ఇది జరుగుతుంది. గతంలో గుండెపోటుతో చాలా మంది చనిపోయారు. కాబట్టి.. గుండె ఆరోగ్యంపై అవగాహన ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఈ సీజన్‌లో 50 ఏళ్లు పైబడిన వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. బీపీ పెరిగి గుండెపోటు వస్తుంది. ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. వీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో ప్రత్యేక ఆహారం తీసుకోవాలి. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు చేర్చాలి. కొవ్వు, కార్బోహైడ్రేట్లను తక్కువ పరిమాణంలో తీసుకోడం ఉత్తమం.

ఈ సీజన్‌లో గుండెను పరీక్షించుకోవడానికి వైద్యుల సూచనలు తీసుకోవాలి. గుండెలో ఏదైనా లోపం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్, గుండెలో ఏదైనా అడ్డంకిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఛాతీ నొప్పి, అకస్మాత్తుగా సంభవించడం లేదా హృదయ స్పందన పెరుగుదల, అకస్మాత్తుగా విపరీతమైన చెమట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. గుండెపోటు లక్షణాలు కావచ్చు. మీకు అలాంటి సమస్య కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించండి.

మధుమేహం, హైబీపీ ఉన్న రోగులు ఈ సీజన్‌లో సమయానికి మందులు వేసుకోవాలి. ఇప్పటికే ఏదైనా గుండె జబ్బు ఉన్న వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఫాలో-అప్ కోసం క్రమం తప్పకుండా వైద్యుల వద్దకు వెళ్లాలి. గుండె జబ్బులకు సంబంధించిన ఏవైనా లక్షణాలు కనిపిస్తే, దాని గురించి నిర్లక్ష్యం చేయవద్దు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏమైనా సందేహాలు ఉంటే వైద్యులు, నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!
విజయాల లక్నో, పరాజయాల చెన్నై.. గెలుపు ఎవరిదో తెలుసుగా మచ్చా?
విజయాల లక్నో, పరాజయాల చెన్నై.. గెలుపు ఎవరిదో తెలుసుగా మచ్చా?
మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా