Smart Phones: మగవారికి అలర్ట్.. ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోతున్నారా.. ఆ సమస్య రావొచ్చు జాగ్రత్త..
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ (Smart Phone) అనేది అత్యంత అవసరమైన వస్తువుగా మారిపోయింది. ఎంతగా అంటే దాన్ని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేనంతగా. ఫోన్ చేతిలో లేనిదే ఏ పనీ జరగడం లేదు. ఫోన్ కాల్స్, ఛాటింగ్,..
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ (Smart Phone) అనేది అత్యంత అవసరమైన వస్తువుగా మారిపోయింది. ఎంతగా అంటే దాన్ని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేనంతగా. ఫోన్ చేతిలో లేనిదే ఏ పనీ జరగడం లేదు. ఫోన్ కాల్స్, ఛాటింగ్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్ సమస్తం ఫోన్ నుంచే జరుగుతున్నాయి. నిద్రపోతున్నా, మెలకువగా ఉన్నా, బాత్‌రూమ్‌లో ఉన్నా, బయట ఉన్నా ఫోనే లోకం. ఆఖరుకు నిద్రపోయే సమయంలోనూ ఒడిలో పెట్టుకోవడమో, దిండు కింద పెట్టుకోవడమో వంటివి చేస్తున్నాం. అయితే ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని నిపుణులు (Health Problems) సూచిస్తున్నారు. లేకుంటే చాలా సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం లేచేటప్పుడు మూడీగా, అలసిపోయినట్టు, డిస్టర్బ్‌గా లేస్తూ ఉంటారు. దీనికి ఫోన్ కూడా ఓ కారణం. నిద్రపోయే ముందు ఫోన్ చూడటం వల్ల మానసిక ఒత్తిడి, యాంగ్జైటీ, స్థూలకాయం, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఫోన్ సైలెంట్ కిల్లర్‌గా మారి మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది. ఇప్పుడే మేల్కోకుంటే పెను ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్‌లు రేడియేషన్‌ను విడుదల చేస్తాయనే విషయం మనకు తెలిసిందే. ఇది మెదడును దెబ్బతీస్తుంది. ఫలితంగా తలనొప్పి, కండరాల నొప్పి సమస్యలు వస్యాయి.
మొబైల్ ఫోన్ రేడియేషన్ కారణంగా అంగస్తంభన లోపం వచ్చే అవకాశం ఉంది. బ్లూ కిరణాల కారణంగా నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఫలితంగా నిద్ర లేమి సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఫోన్‌ల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా మెదడు క్యాన్సర్ వస్తుందని డబ్ల్యూహెచ్ఓ గతంలోనే హెచ్చరించింది. కాబట్టి ఫోన్ ను అధికంగా వినియోగించకుండా మనకు మనమే నియమాలు, నిబంధనలు విధించుకోవాలి. కాబట్టి ఫోన్ ను కనీసం మూడు అడుగుల దూరంలో ఉంచాలి. రాత్రి పూట నిద్రపోయే ముందు చాలా మంది ఫోన్‌తో టైమ్ పాస్ చేస్తుంటారు. ఇలా చేస్తే అరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి నిద్రపోయే సమయానికి అరగంట ముందు స్మార్ట్ ఫోన్‌ను పక్కన పెట్టేయాలి. నిద్రపోయే ముందు నోటిఫికేషన్స్, వైబ్రేషన్స్ రాకుండా సెట్టింగ్స్ చేసుకోవాలి.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి