AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liver Health: ఛాతీలో మంట అనిపిస్తుందా..? లివర్ ప్రమాదంలో పడుతున్నట్లేనట.. ఎందుకో తెలుసుకోండి..

మానవ శరీరంలో కాలేయం చాలా ముఖ్యమైన భాగం. శరీరంలోని అతిపెద్ద గ్రంథి అయిన లివర్ ఎన్నో పనులను నిర్వహిస్తుంది.

Liver Health: ఛాతీలో మంట అనిపిస్తుందా..? లివర్ ప్రమాదంలో పడుతున్నట్లేనట.. ఎందుకో తెలుసుకోండి..
Liver Irritation Causes
Shaik Madar Saheb
|

Updated on: Oct 08, 2022 | 7:42 PM

Share

మానవ శరీరంలో కాలేయం చాలా ముఖ్యమైన భాగం. శరీరంలోని అతిపెద్ద గ్రంథి అయిన లివర్ ఎన్నో పనులను నిర్వహిస్తుంది. కాలేయం జీర్ణవ్యవస్థ నుంచి రక్తాన్ని శరీరంలోని మిగిలిన భాగాలకు సరఫరా చేసే ముందు ఆహారాన్ని ఫిల్టర్ చేస్తుంది. దీంతోపాటు విటమిన్ ఎను సంశ్లేషణ చేయడంతోపాటు గ్లూకోజ్‌ను గ్లైకోజెన్ రూపంలో నిల్వ చేస్తుంది. ముఖ్యమైన విధులను నిర్వహించే కాలేయం దెబ్బతింటే శరీరం ప్రమాదంలో పడుతుంది. ఏదైనా కారణం వల్ల కాలేయంలో ఆటంకం ఎదురై.. యాసిడ్ ఏర్పడటం ప్రారంభమైతే అప్పుడు ఛాతీలో మంట, వేడి, ఉదరం సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో కూర్చోవడం, పడుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది.

కాలేయంలో మంట ఎందుకు వస్తుంది..

కాలేయంలో మంట కలగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది మీ ఆహారం సరిగ్గా లేకపోవటం.. రెండవది మీరు నిద్రపోయే, మేల్కొనే సమయం స్థిరంగా లేకపోవటం. ఈ రెండు సమస్యలలో ఏదైనా ఒకటి దీర్ఘకాలం పాటు కొనసాగితే, కాలేయం బలహీనపడటం మొదలవుతుంది. బలహీనమైన కాలేయం జిడ్డుగల పదార్థాలను లేదా శుద్ధి చేసిన పిండి, మసాలా ఆహారాలను సులభంగా జీర్ణం చేసుకోదు. అందుకే మంట సమస్య మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి

కాలేయం ఇబ్బందుల్లో పడితే కనిపించే లక్షణాలు..

  • కాలేయం చికాకు ప్రధాన లక్షణం ఎసిడిటీ సమస్య అన్ని సమయాలలో ఉంటుంది. ఈ అసిడిటీ లేదా పొట్ట వేడి ఎక్కువగా ఉండడం వల్ల చికాకును తగ్గించే మందులు కూడా పెద్దగా ప్రభావం చూపవు.
  • తక్కువ లేదా ఆకలి ఉండదు.
  • ఛాతీపై మంట కూడా ఉండవచ్చు.
  • నోటిలో చేదు రుచి ఉంటుంది.
  • నోటి దుర్వాసన సమస్య ఉంటుంది.

కాలేయం మంట సమస్యను ఎలా తగ్గించాలి

కాలేయం మంటను శాంతపరచడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం బర్నింగ్ సెన్సేషన్ నుంచి వెంటనే ఉపశమనం పొందడానికి ముందు దానిని గుర్తించగలగాలి. ముందు వైద్యులను సంప్రదించడం మంచిది. కాలేయంలో మంట సమస్యను నివారించడానికి కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు.

తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి..

  • చల్లని పాలు తాగాలి
  • లస్సీ తాగండి కొబ్బరి నీళ్లు తాగండి
  • సోంపు, చక్కెర మిఠాయి తినండి
  • తేనె తీసుకోండి..
  • ఉసిరి తినండి, ఉసిరి పొడి లేదా మిఠాయి తినండి

దీర్ఘకాలిక పరిష్కారం

  • సమయానికి ఆహారం తినండి.
  • పాల ఉత్పత్తులతో ఉప్పు ఎప్పుడూ తినకూడదు.
  • పనీర్ వండి తినకూడదు. తినాలనుకుంటే.. పచ్చిగా ఉప్పు లేకుండా తినొచ్చు.
  • ఆహారం తిన్న వెంటనే టీ, పాలు తీసుకోవద్దు.
  • నిద్రవేళ, మేల్కొనే సమయాలను నిర్ధారించుకోండి.
  • రాత్రిపూట లేటుగా పడుకునే అలవాటును మానుకోండి.
  • ఒత్తిడి కారణంగా, జీర్ణక్రియ కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది.
  • కావున ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయండి.
  • సాధ్యమైనంత వరకు రోజూ వ్యాయమం చేయాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి