AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mental Health: మానసిక ఆరోగ్యం క్షీణించడం వల్ల శరీరంలో అనేక వ్యాధులు.. అధ్యయనంలో కీలక విషయాలు

కరోనా మహమ్మారి తర్వాత మానసిక సమస్యలు చాలా పెరిగాయి . పెద్దల నుంచి పిల్లల వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మీరు కూడా ఆందోళన, ఒంటరిగా ఉన్న అనుభూతి, ఏ పనిలో..

Mental Health: మానసిక ఆరోగ్యం క్షీణించడం వల్ల శరీరంలో అనేక వ్యాధులు.. అధ్యయనంలో కీలక విషయాలు
Mental Health
Subhash Goud
|

Updated on: Oct 08, 2022 | 7:27 PM

Share

కరోనా మహమ్మారి తర్వాత మానసిక సమస్యలు చాలా పెరిగాయి . పెద్దల నుంచి పిల్లల వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మీరు కూడా ఆందోళన, ఒంటరిగా ఉన్న అనుభూతి, ఏ పనిలో శ్రద్ధ లేకపోవడం, కారణం లేకుండా మానసిక ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ఇవన్నీ మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడానికి ముందస్తు సంకేతాలు. వీటిని సకాలంలో పట్టించుకోకపోతే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. దీని కారణంగా శరీరంలో అనేక ఇతర వ్యాధులు కూడా వృద్ధి చెందుతాయి.

మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉందని ఇంటర్నల్ మెడిసిన్ వైద్యుడు అజిత్ కుమార్ చెబుతున్నారు. మానసిక ఒత్తిడి వల్ల కలిగే వాపు అధిక రక్తపోటుకు కారణమవుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. ఒక వ్యక్తి ఎప్పుడూ ఆందోళన లేదా మానసిక ఒత్తిడిలో ఉంటే అది అతని జీవనశైలిని పాడు చేస్తుంది. దాంతో శరీరంలో ఊబకాయం సమస్య పెరగడం మొదలవుతుంది. ఊబకాయం వల్ల బీఎంఐ పెరిగి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బరువు పెరగడం కూడా గుండె జబ్బులకు కారణం అవుతుంది.

కోవిడ్‌ తర్వాత ప్రజల్లో గుండెపోటు కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసిక ఆరోగ్యం క్షీణించడం కూడా దీనికి ప్రధాన కారణం. యువత పెద్దఎత్తున ఈ సమస్య బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల శరీరంలో ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల చాలా సార్లు కార్టిసాల్ హార్మోన్ ఎక్కువ అవ్వడం మొదలవుతుంది. మెటబాలిజం సరిగా ఉండదు. ఈ హార్మోన్ అధిక ఉత్పత్తి కారణంగా ఒక వ్యక్తి కూడా ఎక్కువ తీపి, కొవ్వు పదార్ధాలను తినడం అలవాటు చేసుకుంటాడు. దీని వల్ల శరీరంలో బరువు పెరగడం మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి

మధుమేహం ప్రమాదం:

2020లో ది లాన్సెంట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. బలహీనమైన మానసిక ఆరోగ్యం టైప్-2 మధుమేహానికి దారి తీస్తుంది. మానసిక ఆరోగ్యం సరిగా లేని చాలా మంది రోగులు బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. చాలా మంది రోగులు ప్రీ-డయాబెటిక్ దశలో కూడా ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు.

మానసిక ఆరోగ్యంగా ఉండాలంటే..

☛ కారణం లేకుండా మానసిక ఒత్తిడికి గురికావద్దు

☛ సరైన నిద్ర ఉండాలి

☛ ప్రతిరోజూ వ్యాయామం చేయండి

☛ సోషల్ మీడియాను తక్కువగా వాడటం మంచిది

☛ మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తే, స్నేహితులను కలుసుకోండి. వారితో సరదాగా గడపండి

☛ పగటిపూట మీ పని కాకుండా అభిరుచికి సంబంధించిన కొన్ని కార్యకలాపాలను చేయడానికి ప్రయత్నించండి

☛ మీరు ఎటువంటి కారణం లేకుండా చింతిస్తున్నట్లయితే లేదా అతిగా ఆలోచించినట్లయితే, మానసిక వైద్యుడిని సంప్రదించండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి