Cholesterol tips: చాక్లెట్ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? వైద్య నిపుణులు చెబుతున్న కీలక విషయాలు
కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమైనదే.. అయితే, మన శరీరానికి ఏ కొలెస్ట్రాల్ అవసరమో తెలుసుకోవాలి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు..
చాక్లెట్ అంటే పిల్లలకే కాదు.. అందరూ ఇష్టపడుతుంటారు. అలాంటి చాక్లెట్స్ కొన్ని ఆరోగ్యానికి మేసేవిగా ఉంటాయి. అన్ని రకాల చాక్లెట్లు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అదేవిధంగా జీర్ణక్రియ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీరంలో ధమనులు, సిరల పనితీరును మెరుగుపరుస్తుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమైనదే.. అయితే, మన శరీరానికి ఏ కొలెస్ట్రాల్ అవసరమో తెలుసుకోవాలి. హెచ్‌డిఎల్, ఎల్‌డిఎల్ అనే రెండు రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. ఇందులో హెచ్‌డిఎల్ మంచి కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ చెడు కొలెస్ట్రాల్. అదే సమయంలో ఏదైనా కొలెస్ట్రాల్ శరీరంలో మితంగా ఉండాలి. దానిని మించి ఉంటే మీకు ప్రమాదం పొంచిఉన్నట్లే.
మీ మొత్తం కొలెస్ట్రాల్ 200-239 mg/dL మధ్య ఉంటే అది కొంచెం ఎక్కువగా పరిగణించబడుతుంది. 240 mg/dL కంటే ఎక్కువ ఉంటే అది ఎక్కువగా పరిగణించబడుతుంది. మీ LDL కొలెస్ట్రాల్ 130 -159 mg/dL మధ్య ఉంటే, అది కొంచెం ఎక్కువగా పరిగణించబడుతుంది. ఇది 160 mg/dL కంటే ఎక్కువ ఉంటే అది ఎక్కువగా పరిగణించబడుతుంది. మీ HDL కొలెస్ట్రాల్ 40 mg/dL కంటే తక్కువగా ఉంటే అది చెడుగా పరిగణించబడుతుంది. అయితే, కొన్ని జీవనశైలి, వ్యాయామం, ఆహారం, కొన్ని మందులతో శరీరంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలను సాధారణంగా ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా సమతుల్యం చేయవచ్చు. డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
డార్క్ చాక్లెట్ వంటి కోకో డెరివేటివ్‌లలో 70% కంటే ఎక్కువ పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL)ని పెంచడానికి, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం వల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కోకో పౌడర్ కంటే కోకో పౌడర్‌ను ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కోకో పౌడర్‌లో పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి