AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Pollution: పెరిగిపోతున్న వాయు కాలుష్యం.. పురుషుల్లో ఆ సమస్యలకు వెల్‏కమ్ చెబుతోంది..

రోజురోజుకు పెరిగిపోతున్న వాయుకాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీలో ఈ ప్రభావం మరింత అధికంగా ఉంది. అక్కడ గాలిలో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా పడిపోవడం అక్కడి పరిస్థితులకు...

Air Pollution: పెరిగిపోతున్న వాయు కాలుష్యం.. పురుషుల్లో ఆ సమస్యలకు వెల్‏కమ్ చెబుతోంది..
Air Pollutiion
Ganesh Mudavath
|

Updated on: Nov 12, 2022 | 8:14 AM

Share

రోజురోజుకు పెరిగిపోతున్న వాయుకాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీలో ఈ ప్రభావం మరింత అధికంగా ఉంది. అక్కడ గాలిలో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా పడిపోవడం అక్కడి పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. కొన్ని రోజులుగా ఫ్యాక్టరీలు, వాహనాల నుంచి వెలువడే విష వాయువులు, పొగ, దుమ్ము, పొగ కారణంగా రాజధాని అంతటా పొగమంచు ఆవహించింది. పొగ, ధూళి కలిసిన వాతావరణం ఆరోగ్యానికి చాలా హానికరం. అంతే కాకుండా అనేక వ్యాధులకు కారణమవుతుంది. గాలిలో తేలికగా కరిగిపోయే ఈ కాలుష్య విషాలు చాలా మంది పురుగుల లైంగిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతు్నాయి. వాహనాల నుంచి వెలువడే విషపూరిత పొగ కారణంగా పురుషుల్లో అంగస్తంభన లోపం ఏర్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో వారు లైంగిక జీవితాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక హార్మోన్ లు అయిన టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజెన్ లను పొగమంచు ప్రభావితం చేస్తోంది. ఈ రెండు హార్మోన్లు పురుషులు, స్త్రీల లైంగిక సామర్థ్యం, పునరుత్పత్తి ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

కాలుష్యం మన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా లైంగిక సంబంధాలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. అంతే కాకుండా వంధ్యత్వానికి కూడా దారి తీస్తుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. శబ్ద కాలుష్యంతో పాటు అనేక ఇతర పర్యావరణ కారకాలు కూడా లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

2019 అధ్యయనంలో టాక్సిక్ కార్ ఫ్యూమ్‌లకు గురికావడం వల్ల అనేక అంగస్తంభన సమస్యలు ఉన్నాయని నివేదించింది. జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. కలుషితమైన విష కణాల వల్ల రక్త నాళాల్లో మంట ఏర్పడుతుంది. ఇది పునరుత్పత్తి అవయవాలకు ఆక్సిజన్ చేరకుండా అడ్డుకుంటుంది. వారి లైంగిక ప్రేరేపణ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనవంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాల్సిన అవసరం చాలా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇతర ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి