ప్రతి నొప్పికి ఔషధం మీ వంటగదిలోనే ఉంది..! కరోనా సమయంలో వాటిని గుర్తించడం అత్యవసరం..
Natural Pain Killers: కొంతమందికి శరీరంలో ఏ పార్ట్ అయినా కాస్త నొప్పిగా అనిపిస్తే చాలు వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకునే అలవాటు ఉంటుంది.
Natural Pain Killers: కొంతమందికి శరీరంలో ఏ పార్ట్ అయినా కాస్త నొప్పిగా అనిపిస్తే చాలు వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకునే అలవాటు ఉంటుంది. కానీ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ ఆరోగ్యానికి హానికరం. ఇవి మీ కిడ్నీ, కాలేయాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వాటిని ఎక్కువగా వాడకూడదు. వాస్తవానికి చిన్న చిన్న రోజువారీ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే అన్ని వస్తువులు మీ వంటగదిలోనే ఉంటాయి. ఈ నేచురల్ పెయిన్ కిల్లర్స్ అనేక రకాల నొప్పులు, ఇతర సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. ఇవి అవయవాలపై ఎటువంటి దుష్ప్రభావం చూపవు. కాబట్టి నమ్మకంగా వాడవచ్చు. అటువంటి ఐదు సహజ నొప్పి నివారణల గురించి తెలుసుకుందాం.
1. అల్లం
తలనొప్పిగా ఉంటే అల్లం కొంచెం తీసుకొని పేస్ట్ లా చేసి నుదుటిపై రాసుకోవాలి. అల్లం నొప్పి నుంచి తక్షణం ఉపశమనం కలిగించే లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా అల్లం వాతాన్ని కూడా తగ్గిస్తుంది. నల్ల ఉప్పుతో అల్లం తింటే కడుపులో ఏర్పడిన గ్యాస్ సమస్య తొలగిపోతుంది. జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలను నివారించడానికి అల్లం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
2. పసుపు
పసుపులో నొప్పిని తగ్గించే గుణాలు ఉంటాయి. గాయం అయినప్పుడు, వాపు వచ్చినప్పుడు ఆవాల నూనెలో కొంచెం పసుపు కలుపుకొని గోరువెచ్చని వేడితో ప్రభావిత ప్రాంతంలో రాయండి. ఇది నొప్పి, వాపును తగ్గిస్తుంది. పసుపును పాలతో కలిపి తీసుకోవడం వల్ల కండరాలలో అంతర్గత నొప్పులు తగ్గుతాయి. అంతే కాకుండా జలుబు, దగ్గు సమస్య నుంచి ఉపశమనాన్నిఇస్తుంది.
3. ఉల్లిపాయ
ఉల్లిపాయ రసంలో నొప్పిని తగ్గించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. బాణలిపై ఉల్లిపాయను వేడి చేసి దాని రసాన్ని తీసి కీళ్లపై పూస్తే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కాకుండా బెణుకు కారణంగా వాపు వస్తే నొప్పిని తగ్గించడానికి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది.
4. వెల్లుల్లి
మీ శరీరంలోని ఏదైనా భాగంలో నొప్పి ఉంటే మీరు వెల్లుల్లి నూనెతో మసాజ్ చేయాలి. దీనివల్ల చాలా ఉపశమనం కలుగుతుంది. ఛాతీ నొప్పి లేదా బరువుగా ఉన్నట్లయితే, గ్యాస్ సమస్య ఏర్పడితే వెల్లుల్లి మొగ్గలను నీటితో మింగడం వల్ల తగ్గిపోతుంది. జలుబు, దగ్గుకి కూడా వెల్లుల్లి చక్కగా పనిచేస్తుంది.