AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Vaccination: ఫిబ్రవరి చివరి నాటికి 12 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్.. ఎన్‌టీఎజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా కీలక వ్యాఖ్యలు..

Covid-19 vaccination for 12 year kids: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం లక్షలాది కేసులు, వందలాది మరణాలు

Covid-19 Vaccination: ఫిబ్రవరి చివరి నాటికి 12 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్.. ఎన్‌టీఎజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా కీలక వ్యాఖ్యలు..
Covid 19 Vaccination
Shaik Madar Saheb
| Edited By: Subhash Goud|

Updated on: Jan 15, 2022 | 9:46 PM

Share

Covid-19 vaccination for 12 year kids: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం లక్షలాది కేసులు, వందలాది మరణాలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. అయితే.. పెరుగుతున్న కేసుల మధ్య కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను (Covid-19 vaccination) సైతం వేగవంతం చేసింది. అంతేకాకుండా బూస్టర్‌ డోసును సైతం అందిస్తోంది. చిన్నారులకు సైతం వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం పలు మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. జనవరి ప్రారంభం నుంచి దేశంలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌ను అందిస్తోంది. పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జనవరి 3, 2022న ప్రారంభించారు. అంతేకాకుండా 12 సంవత్సరాలకు పైగా పిల్లలకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే.. పిల్లలకు వ్యాక్సిన్‌పై తల్లిదండ్రుల్లో సైతం సందేహాలున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి చివరి నాటికి 12 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు (Children) వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) చైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా (NK Arora) పేర్కొన్నారు. తాజాగా.. ఆయన న్యూస్ 9తో ప్రత్యేకంగా మాట్లాడారు. జనవరి చివరి నాటికి కోవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మహమ్మారిని తేలికగా తీసుకుంటే… ఎక్కువ హాని జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా పెరిగే అవకాశముందన్నారు. పెరుగుతున్న కేసులను నిశితంగా పరిశీలిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎన్‌కె అరోరా పలు విషయాలపై మాట్లాడారు.

భారత్ బయోటెక్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు డెల్టా, ఓమిక్రాన్ రెండింటికి వ్యతిరేకంగా మంచి ప్రభావాన్ని చూపిందని చెప్పారు. టీకాలు రూపాంతరం చెందుతున్న వైరస్‌ల నుంచి రక్షణ ఇస్తాయా..? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. వ్యాక్సిన్‌లు ఏవీ ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించలేవంటూ సమాధానమిచ్చారు. కానీ అన్ని టీకాలు ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయన్నారు. ఒమిక్రాన్ మనందరికీ ఈ సత్యాన్ని తెలిపిందని పేర్కొన్నారు. రెండు బూస్టర్ షాట్‌లు తీసుకున్న వారికి ఈ వైరస్ సోకిందని.. అలాగే బూస్టర్ పొందిన వారు కూడా ఓమిక్రాన్ బారిన పడిన ఉదాహరణలు చూశామన్నారు. పూర్తిగా రోగనిరోధక శక్తిని పొందిన వారిలో.. అంటే రెండు డోసులు తీసుకున్న వారిలో ఆసుపత్రిలో చేరే ప్రమాదం దాదాపు 30 రెట్లు తగ్గినట్లు గమనించామన్నారు. అన్ని టీకాలు కూడా ఇదే విధంగా ఉన్నాయన్నారు. కోవాక్సిన్, కోవిషీల్డ్‌తో సహా అన్ని టీకాల ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గిస్తాయన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవడం వారి ప్రాథమిక కర్తవ్యం.. అత్యవసరం అని సూచించారు. బూస్టర్‌ డోసులు లేదా ముందుజాగ్రత్త డోస్ కోసం.. దేశంలో ఉత్తమమైనది ఏదో చెప్పడానికి తమ వద్ద తగినంత డేటా లేదన్నారు. అయినప్పటికీ.. బాధితులను సాయం చేసే దిశగా మనం వినూత్న దృక్పథాన్ని కలిగి ఉండాలంటూ అరోరా తెలిపారు.

కోవాక్సిన్ పని విధానంపై.. 

ఓమిక్రాన్ వేరియంట్‌తో పోరాడడంలో కోవాక్సిన్‌ బాగా పనిచేస్తుందా..? అన్న ప్రశ్నకు అరోరా మాట్లాడుతూ.. వైరస్, టీకా నిర్మాణ పనితీరు సంబంధం గురించి మనకు ఖచ్చితంగా తెలియదన్నారు. ఏదైనా వ్యాక్సిన్‌కు అనుకూలంగా వ్యతిరేకంగా వాదన చేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. MRNA ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన వ్యాక్సిన్‌ల నుండి Omicron తప్పించుకోగలదని రుజువు చేసే కొన్ని అధ్యయనాలు పశ్చిమ దేశాల నుండి వస్తున్నాయన్నారు. ఈ వ్యాక్సిన్‌లల్లో (Pfizer -Moderna) ఒక విధంగా రూపొందించబడ్డాయన్నారు.

అయినప్పటికీ.. ఓమిక్రాన్ వేరియంట్‌లో దాదాపు 50 మ్యుటేషన్‌లు ఉన్నాయని అరోరా తెలిపారు. వాటిలో చాలా వరకు స్పైక్ ప్రోటీన్, దాని రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌పై ఉన్నాయన్నారు. డెల్టా, డెల్టా ప్లస్‌లో, డొమైన్‌లో కేవలం రెండు దశలు మాత్రమే ఉందన్నారు. ఇక్కడ ఓమిక్రాన్ విషయానికొస్తే 10 ఉన్నాయన్నారు. అందుకే ఇతర వ్యాక్సిన్‌లు కొత్త వేరియంట్‌కు తగిన విధంగా స్పందించలేకపోవచ్చునని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారన్నారు. కానీ ఈ సమయంలో అదంతా ఊహ మీద ఆధారపడి ఉంటుందని అరోరా పేర్కొన్నారు.

12 ఏళ్లు పైబడిన వారికి.. 

యుక్తవయస్సులో ఉన్నవారికి టీకాలు వేయడంతో మేము మంచి ఫలితాలను సాధించాము. కానీ DCGI 12 కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కూడా ప్రాథమిక మోతాదుకు అనుమతిని ఇచ్చింది. అది ఎప్పుడైనా జరుగుతుందని మనం చూస్తామా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఫిబ్రవరి-చివరి నాటికి 12 ఏళ్లు పైబడిన పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాలని మేము భావిస్తున్నామన్నారు. ఇది దశలవారీగా జరుగుతోంది. వ్యాక్సిన్‌ కొరత లేదు. ఈ చిన్న వయస్సు సమూహం కోసం మేము మా వ్యూహంతో చాలా జాగ్రత్తగా ఉన్నామని తెలిపారు.

ఇతర టీకాల గురించి మాట్లాడుతూ.. తాము ZyCoV-Dని కూడా ఒక ఎంపికగా చూస్తున్నామన్నారు. ఒకటి లేదా రెండు నెలల్లో, మేము Corbevax గురించి క్లినికల్ డేటా కూడా వస్తుందన్నారు. mRNA వ్యాక్సిన్‌లు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. ఫిబ్రవరి-మార్చిలో మీకు కావలసిన వ్యాక్సిన్‌ను ఎంచుకోవచ్చన్నారు.

తల్లిదండ్రుల సందేహంపై.. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించడంలో సందేహిస్తున్నారు. పిల్లలు మంచి రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని పరిగణించబడుతున్నందున, వారికి వ్యాధి నిరోధక టీకాలు వేయాల్సిన అవసరం ఉందా? పిల్లలు చాలా మంచి రోగనిరోధక ప్రతిస్పందనతో వస్తారని నేను అంగీకరిస్తున్నాను.. పెద్దల కంటే మెరుగైనది. పాఠశాలలు, కళాశాలలు తెరిచే సమయం ఆసన్నమైంది, దీంతో పిల్లలు ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి Omicron చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఇంట్లో ఉన్నా యుక్తవయస్సులో ఉన్నవారు ఇన్ఫెక్షన్ బారిన పడతారు. వృద్ధులు మద్య వయస్సు వారికి కూడా సోకవచ్చు. వ్యాక్సిన్‌లను జాగ్రత్తగా పరిశీలించి ప్రతి ఒక్కరికీ వేయడం చాలా అవసరం. మేం అలా చేస్తున్నాం. అయితే.. ప్రబలుతున్న వైరస్ వేరియంట్లను పరిశీలిస్తే.. ఈ వ్యాధి ఇప్పుడే ముగియదని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి పెరిగినా మన ఆరోగ్య వవస్థ బలంగా ఉందని అరోరా పేర్కొన్నారు.

Also Read:

Heart Problem: మీకు ఈ అలవాట్లు ఉన్నాయా..? గుండె పనితీరు మందగించి సమస్యల్లో చిక్కుకున్నట్లే..!

Salt Effect: మీలో ఈ సమస్యలు ఉన్నాయా..? అయితే ఉప్పు ఎక్కువగా తింటున్నట్లే అర్థం..!