Egg White Vs Egg Yolk: గుడ్డులోని పచ్చసొన తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? ఈ బేతాళ ప్రశ్నకు ఆన్సర్ ఇదే
నేటి జీవన శైలి కారణంగా కొలెస్ట్రాల్ సమస్య దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. కొలెస్ట్రాల్ సమస్య నిర్ధారణ అయితే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒంట్లో కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అయితే గుడ్లు తినేటప్పుడు, చాలా మంది పసుపు భాగాన్ని తినకూడదని హెచ్చరిస్తుంటారు. ఇది తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందని, దానిని తినకపోవడమే మంచిదని చెబుతుంటారు..
నేటి జీవన శైలి కారణంగా కొలెస్ట్రాల్ సమస్య దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. కొలెస్ట్రాల్ సమస్య నిర్ధారణ అయితే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒంట్లో కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అయితే గుడ్లు తినేటప్పుడు, చాలా మంది పసుపు భాగాన్ని తినకూడదని హెచ్చరిస్తుంటారు. ఇది తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందని, దానిని తినకపోవడమే మంచిదని చెబుతుంటారు. నిజంగానే గుడ్డు పచ్చసొన తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీంతో చాలా మంది శరీరంలో ఎలాంటి సమస్య లేకపోయినా పచ్చసొన తినేందుకు భయపడుతుంటారు. మీరూ ఇలా తింటున్నారా? ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందా..
గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వులు ఉంటాయి. అయితే, మీ శారీరక స్థితిని బట్టి, గుడ్డు పచ్చసొన లేదా తెల్లసొన తినాలా? వద్దా? అనేది తెలుసుకోవడానికి ముందు.. అసలు గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
గుడ్డులోని తెల్లసొన తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..
- గుడ్డులోని తెల్లసొనలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు గుడ్డులోని తెల్లసొన తినవచ్చు.
- గుడ్డులోని తెల్లసొనలో కూడా ప్రొటీన్ ఉంటుంది. గుడ్డులోని తెల్లసొనలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలోని అనేక శారీరక విధుల్లో సహాయపడతాయి. ముఖ్యంగా కండరాల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
- గుడ్డులోని తెల్లసొనలో కొలెస్ట్రాల్ ఉండదు. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు గుడ్డులోని తెల్లసొనను సురక్షితంగా తినవచ్చు.
గుడ్డు పచ్చసొన తినడం వల్ల కలిగే లాభాలు..
- గుడ్డు పచ్చసొనలో కేలరీలు ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో విటమిన్లు ఎ, డి, ఇ, కె, బి, ఐరన్, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలు చాలా అవసరం.
- గుడ్డు పచ్చసొనలో కోలిన్ అనే ఖనిజం ఉంటుంది. ఇది మెదడు కార్యకలాపాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ ఖనిజం జీవక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
- అన్ని కొవ్వులు చెడ్డవి కావు. గుండె ఆరోగ్యానికి మంచి కొవ్వులు కూడా అవసరం. గుడ్డు పచ్చసొనలో ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే బహుళఅసంతృప్త, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. అయితే, గుడ్డులోని పచ్చసొన ఎక్కువగా తింటే మాత్రం కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మితంగా తీసుకోవాలి.