Egg Side Effects: ఆరోగ్యానికి మేలు అని కోడిగుడ్లను కుమ్మేస్తున్నారా? జర భద్రం.. ఇది తెలుసుకోండి..!

Egg Side Effects: గుడ్డులో అనేక పోషకాలు ఉన్నాయి. అందుకే ప్రతి రోజూ గుడ్డును తినాలిన వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.

Egg Side Effects: ఆరోగ్యానికి మేలు అని కోడిగుడ్లను కుమ్మేస్తున్నారా? జర భద్రం.. ఇది తెలుసుకోండి..!
Egg
Follow us

|

Updated on: Jul 23, 2022 | 6:50 AM

Egg Side Effects: గుడ్డులో అనేక పోషకాలు ఉన్నాయి. అందుకే ప్రతి రోజూ గుడ్డును తినాలిన వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. సాధారణంగానే గుడ్డు ఆహారంలో భాగం. రోజూ ఉదయం అల్పాహారంలో గానీ, మధ్యాహ్న భోజనంలో గానీ గుడ్లను తీసుకుంటారు. ఉదయం అల్పాహారంగా గుడ్లు తింటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండి.. ఆకలిగా అనిపించదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజూ గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని తెలుసా? అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. రోజుకు ఒక గుడ్డు సరిపోతుంది. ఇక రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు అనేది మీ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల కూడా అనారోగ్యానికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు.

రోజుకు ఎన్ని గుడ్లు తినాలి: రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల శరీరానికి మంచిదని చాలా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మధుమేహం, గుండె, అధిక రక్తపోటు సమస్యలు లేకుంటే ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినవచ్చు.

గుడ్డు పచ్చసొన ఆరోగ్యానికి మంచిదా? బాడీబిల్డర్లు, ఫిట్‌నెస్ ప్రియులు ప్రతిరోజూ గుడ్లు తీసుకుంటారని మనందరికీ తెలుసు. గుడ్డులోని పచ్చసొన భాగాన్ని తినకూడదని సలహా ఇస్తున్నారు. గుడ్డు పచ్చసొన రుచిలో భిన్నంగా ఉంటుంది. గుడ్డు పచ్చసొన తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు గుడ్డులోని పచ్చసొన భాగాన్ని తినకూడదు. CDC ప్రకారం, HIV తో జీవిస్తున్న వ్యక్తులు, అవయవ మార్పిడి చేయించుకున్న వారు గుడ్డు పచ్చసొన తినకుండా ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఎక్కువ గుడ్లు తింటే ఏం జరుగుతుంది? గుడ్లు ఎక్కువగా తినే వారికి చర్మ సమస్యలు వస్తాయి. రోజుకు 2 కంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల కండరాల నొప్పులు, తిమ్మిర్లు వస్తాయి. జుట్టు రాలే సమస్యను కూడా తీవ్రం చేస్తుంది. వేసవిలో వాంతులు, విరేచనాలు, కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. గుడ్లు శరీర భాగాలలో మంటను కలిగిస్తాయి.

(గమనిక: పై కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. దీనిని TV9 డిజిటల్‌ ధృవీకరించడం లేదు. సరైన మార్గదర్శకత్వం లేదా చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..