AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Benefits: గుడ్లు తినేటప్పుడు పసుపు భాగాన్ని తొలగిస్తారా? ఈ విషయం తెలిస్తే ఎప్పుడూ అలా చేయరు..

Egg Benefits: గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్ అని అంటుంటారు. అందులో ఉండే ప్రోటీన్స్ మనిషి శరీరానికి అంత మేలు చేస్తాయి మరి. అందుకే..

Egg Benefits: గుడ్లు తినేటప్పుడు పసుపు భాగాన్ని తొలగిస్తారా? ఈ విషయం తెలిస్తే ఎప్పుడూ అలా చేయరు..
Egg
Shiva Prajapati
| Edited By: |

Updated on: Aug 12, 2021 | 7:18 AM

Share

Egg Benefits: గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్ అని అంటుంటారు. అందులో ఉండే ప్రోటీన్స్ మనిషి శరీరానికి అంత మేలు చేస్తాయి మరి. అందుకే.. ప్రతీ రోజూ ఒక గుడ్డును ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ చూపే వ్యక్తులు, గుడ్డు లోపల ఉండే పసుపు భాగాన్ని తీసివేసి తెల్లటి భాగాన్ని మాత్రమే తింటారు. మరి ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా? అలా చేయడం సరైనదేనా? గుడ్డులోని పసుపు సొన వల్లే శరీరానికి కలిగే ఉపయోగాలేంటో మీకు తెలుసా? గుడ్డుకు సంబంధించి అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తవానికి, పచ్చసొనలో ఎక్కువ కొవ్వు ఉంటుందని అందరూ భావిస్తారు. ఇది శరీరానికి హానీకరం అని భావించి.. దానిని గుడ్డు తినేందుకు ఆసక్తి చూపరు. అయితే, గుడ్డులో పచ్చ సొనలో 186 మిల్లీ గ్రాము కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది శరీరానికి అంత హానీకరం కాదని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి శరీరానికి కూడా కొలెస్ట్రాల్ అవసరం. ఇది టెస్టోస్టిరాన్‌ను తయారు చేస్తుంది. శక్తిని ఇచ్చి.. కండరాలను పెంచుతుంది.

పోషకాలకు కేంద్రం గుడ్డులోని పచ్చ సొన.. గుడ్డు పచ్చసొనలో చాలా విటమిన్లు A, D, E, B-12, K, ఐరన్, రిబోఫ్లేవిన్ వంటివి ఉంటాయి. అందువల్ల, మనిషి శరీరానికి ఇది చాలా అవసరం. వి శరీర సమతులాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది. మరి మీరు కేవలం గుడ్డులోని తెల్లటి భాగాన్ని మాత్రమే తింటుంటే.. ఈ పోషకాలన్నింటినీ దూరం చేస్తున్నట్లే. అందుకే.. గుడ్డులోని పసుపు సొన కూడా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వైట్ ఎగ్ కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. అదే సమయంలో, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం.. ప్రతి వారం ఏడు గుడ్లు తినే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువట. అయితే, మీరు ఒక రోజులో పచ్చసొనతో 7-8 గుడ్లు తింటే మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని స్పష్టం చేశారు.

గుడ్డు పచ్చసొన తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అనేక నివేదికల ప్రకారం.. గుడ్డులో ఉండే తెల్ల, పచ్చ సొనలో కోలిన్ అనే ముఖ్యమైన మూలకం ఉంటుంది. ఇది మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కాకుండా, గర్భధారణ, చనుబాలిచ్చే సమయంలో కోలిన్ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మెదడుకు చాలా మంచిది. దీంతో పాటు ఇది శక్తి పరంగానూ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. కళ్లను రక్షిస్తుంది.

Also read:

Rich Village: దక్షిణాసియాలోనే అత్యంత ధనిక గ్రామం.. వారి ఆస్తుల వివరాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Andhra Pradesh: నాలుగేళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయిన భర్త.. విగ్రహానికి నిత్యం పూజలు చేస్తున్న మహిళ..

Hyderabad City: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. చదువు నేర్పుతారని పిల్లలను పంపిస్తే..

Follow Us
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే