Sleep less: నిద్రలేమితో సతమతమవుతున్నారా.? సరైన నిద్రలేకపోతే జరిగే అనార్థాలు అన్నీ ఇన్నీ కావు..
Health Problems With Sleep less: ఇటీవలి కాలంలో నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మారుతోన్న ఉద్యోగ శైలి, ఆహార అలవాట్ల కారణంగా నిద్రకు దూరమవుతున్నారు. కంటినిండ నిద్రలేక సతమతమవుతున్న వారు..
Health Problems With Sleep less: ఇటీవలి కాలంలో నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మారుతోన్న ఉద్యోగ శైలి, ఆహార అలవాట్ల కారణంగా నిద్రకు దూరమవుతున్నారు. కంటినిండ నిద్రలేక సతమతమవుతున్న వారు మనలో ఎంతో మంది. అయితే సరైన నిద్ర లేకపోతే జరిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావని మీకు తెలుసా? నిద్రలేమి కాలక్రమేణ ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ సరైన నిద్రలేకపోతే వచ్చే సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం..
* నిద్రలేమితో బాధపడేవారిలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం దెబ్బతింటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల జపాన్‌కు చెందిన శాస్ర్తవేత్తలు ఎలుకలపై జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు. నిద్రలేమి కాలక్రమేణా మధుమేహానికి దారి తీస్తుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.
* ఏడు గంటల కన్న తక్కువ నిద్ర పోయేవారికి జలుబు త్వరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఓ అధ్యయనంలో తేలింది.
* నిద్రలేమి కారణంగా ఊబకాయం సమస్య కూడా తలెత్తే అవకాశాలున్నాయని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం.. నిద్రలేమితో ఆకలిని పుట్టించే గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదల కావడమే.
* కంటినిండా నిద్రలేకపోతే.. మెదడు పనితీరుపై కూడా ప్రభావం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మెదడులో పెరిగే వ్యర్థ కణాలు నిద్రపోయినప్పడు తొలగిపోతాయని పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆర్యోగంపై కూడా నిద్రలేమి ప్రభావం పడుతుందన్నమాట.
* నిద్రలేమి కారణంగా గుండె సంబధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీపీ పెరగడం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
* సరైన నిద్రలేకపోతే దీర్ఘకాలికంగా వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుందని పరిశోధనల్లో తేలింది. దీంతో తరచూ అనారోగ్యం బారిన పడే అవకాశాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Toothbrush: మీరు వాడే టూత్ బ్రష్ కు ఆయుస్సు ఉంటుంది.. ఎన్ని నెలలకు మార్చాలంటే..
Benefits of Hot Water: పరిగడుపున వేడి నీరు తాగితే.. ఈ రోగాలకు చెక్ పెట్టవచ్చు తెలుసా..? అవి ఎంటంటే..
Triphallia: వైద్య చరిత్రలోనే తొలిసారిగా.. మూడు పురుషాంగాలతో జన్మించిన శిశువు.. ఎక్కడంటే..?